రాష్ట్ర హ్యాండ్లూమ్స్ అండ్ క్రాఫ్ట్స్ గౌరవ సలహాదారు సుచిత్ర ఎల్లా
విజయవాడ : చేనేతకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించేందుకు కృషి చేస్తానని హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ (Handlooms and Hand Crafts) గౌరవ సలహాదారు సుచిత్ర ఎల్లా అన్నారు. తెలుగు వారి సాంప్రదాయంలో పెళ్లి చీర చాలా ప్రత్యేకమైనదని, అదే విధంగా తన పెళ్లి చీర కంచి పట్టుచీర అని పేర్కొన్నారు. తాను ఇప్పటి వరకూ రెండు, మూడు చేనేత క్లిష్టర్లకు వెళ్లి పరిశీలించానని అన్నారు. రాష్ట్రంలోని అన్ని క్లిష్టర్లను పరిశీలిస్తానని వెల్లడించారు. ఆ మేరకు సుచిత్ర ఎల్లా ఒక ప్రకటన చేస్తూ అనంతరం వారికి కావలసిన సౌకర్యాలు తెలుసుకుని, చేనేత వస్త్రాల స్కేల్ పెంచి బ్రాండింగ్ చేయాలని అభిప్రాయపడ్డారు.
హస్తకళలను అభివృద్ధి చేయొచ్చని సుచిత్ర ఎల్లా
చాలామంది చీరలు చాలా ధర ఎక్కువగా ఉంటుందని అంటున్నారని, కాబట్టి వాటిని కూడా పరిశీలించాలని తెలిపారు. వివిధ రకాల చీరలు, చేనేతపై నేటి తరానికి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అలా చేస్తే హస్తకళలను అభివృద్ధి చేయొచ్చని సుచిత్ర ఎల్లా చెప్పారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే కాటన్ షర్ట్లు, డ్రెస్లు ఇవ్వాలని, తద్వారా వారు కూడా వాటిపై ఇంట్రస్ట్ చూపిస్తారని సుచిత్ర ఎల్లా (Suchitra Ella) అన్నారు. ప్రతిచేనేత వస్త్రం రెండు, మూడు కుటుంబాలకు జీవనాధారమని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. చేనేతలో పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. చేనేతని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని, మన దేశ వస్త్ర నైపుణ్యం, నాణ్యతను ప్రపంచానికి చూపించాలని పేర్కొన్నారు. ప్రభుత్వంతో పాటు పలువురు ఎన్జీఓలు కూడా ఇందుకోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
రకరకాల డిజైన్లలో
చేనేతను మరింతగా ముందుకు తీసుకెళ్తానని సుచిత్ర ఎల్లా స్పష్టం చేశారు. నేటి తరంలోని వారికి సైతం చేనేత నైపుణ్యాన్ని నేర్పించాలని సూచించారు. స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులలో భాగంగా చేనేతను కూడా ట్రైనింగ్ ఇవ్వాలని, అలా చేస్తే పలువురికి ఉపాధి కల్పించొచ్చని అన్నారు. ప్రస్తుతం చేనేత వస్త్రాలను రకరకాల డిజైన్లలో తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. తద్వారా నేటి యువతను సైతం ఆకట్టుకోవచ్చని తెలిపారు. వివిధ రకాలైన ప్రొడక్ట్స్ రూపంలో చేనేత వస్త్రాలను తయారు చేస్తే వీటి మార్కెట్ను పెంచొచ్చని పేర్కొన్నారు. చేనేత కార్మికులకు ఆర్థికంగా ఆదుకోవాలని, లోన్లు ఇవ్వడంతో పాటు వాటిని ఏ విధంగా రీపేమెంట్ చేయాలి అనే దానిపై నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అదే విధంగా మోలిక సదుపాయాలు సైతం మనం కల్పించి ఇస్తే వారు చేనేత పనిని చేసుకుని వెళ్లిపోతారని, తద్వారా వారిపై భారం తగ్గుతుందని తెలిపారు.
సుచిత్ర ఎల్లా విద్యార్హతలు ఏమిటి?
సుచిత్ర ఎల్లా మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి ఎకానామిక్స్ మరియు సోషల్ సైన్సెస్‌లో బీఏ డిగ్రీ పొందారు. అదనంగా, UWCU–మాడిసన్ నుండి బిజినెస్ డెవలప్మెంట్‌లో డిప్లొమా, సౌత్ కరోలినా విశ్వవిద్యాలయం నుండి రియల్ ఎస్టేట్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా, అలాగే నల్సార్–హైదరాబాద్ నుండి పేటెంట్ లాలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేశారు.
భారత్ బయోటెక్ సీఈఓ ఎవరు?
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా. 1996లో ఆయన ఈ సంస్థను స్థాపించారు. విశ్వవిద్యాలయంలో గోల్డ్ మెడలిస్ట్‌గా గుర్తింపు పొందిన డాక్టర్ ఎల్లా, సౌత్ కరోలినా మెడికల్ యూనివర్శిటీ, చార్ల్‌స్టన్‌లో రీసెర్చ్ ఫ్యాకల్టీగా పనిచేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also :