బాధపడుడే తప్ప బాధించడం తెలియని అన్న దాతల్లో ఇటీవల కాలంలో సహనం, ఓర్పు సన్నగిల్లి ఆందోళన బాటపడుతున్నారు. తమకు ఎంతటి నష్టం జరిగినా, ఎవరు ఎంతగా మోసగించినా తమలో తాము కుళ్లికుళ్లి మనసులో బాధపడి చివరకు ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడతారే తప్ప తమను దగాచేసిన వారిపై కక్షకట్టి దాడులు చేసేం దుకు సాహసించలేకపోయేవారు. పంటలకు గిట్టుబాటు ధర రాకపోయినా, దళారులు హస్తలాఘవంతో కోలుకోలేని దగాకు గురవుతున్నా సకాలంలో యూరియా లాంటిఎరు వులు సరఫరా చేయడంలో పాలక పెద్దలు విఫలమైనా నకిలీ, నాసిరకం క్రిమిసంహారక మందులతో మోసపోయినా తమ కర్మకు తాము బాధపడుతూ మనోరోదనతో ఇంటిముఖం పట్టేవారు. కానీ ఇటీవల కాలంలో రోడ్లపైకి రావడం, ధర్నాలు, నిరసనలు లాంటి కార్యక్రమాలు తెలి పేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అవి అక్క డక్కడ సమస్యలు వచ్చినప్పుడు జరుగుతున్నాయే తప్ప సంఘటితంగా జరుగుతున్న సంఘటనలు లేవనే చెప్పొ చ్చు. ఆరుగాలం అష్టకష్టాలుపడి పండించి తెచ్చిన పంట ను అమ్ముకోవడంలో వారుపడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. దేశవ్యాప్తంగా పరిశీలించినా అధికశాతం మార్కెట్ యార్డుల్లో దళారులదే రాజ్యం. కొలతల్లో మోసం. ధరలు నిర్ణయించడంలో దగా, ఒక్కటేమిటి ఎక్కడవీలైతే అక్కడ చేతివాటం ప్రదర్శించేందుకు దళారులు నిత్యం పొంచిఉంటూనే ఉన్నారు. రైతులు మోస పోతూనే ఉన్నారు. మోస పోయేవారు ఉన్నంతకాలం మోసం చేసేవారు ఉంటారన్నట్లు ఈ దళారీ వ్యవస్థ ఉన్నంత కాలం రైతులకు ఈ బాధలు తప్పవు. విత్తే దగ్గర నుంచి విక్రయించేవరకు అన్నిస్థాయిల్లోనూ దగా జరుగుతున్నది. దీనిని నిరోధించేందుకు పాలకులు ఎప్ప టికప్పుడు చర్యలు చేపడుతున్నా ఆశించిన ఫలితాలు కన్పించడం లేదు. వ్యవసాయానికి మూలం విత్తనాలు. ఆ విత్తనాలే నకిలీ, నాసిరకమో అయితే రైతులు కుప్ప కూలిపోతున్నారు. నకిలీ, నాసిరకం విత్తనాలు సరఫరా చేసి రైతులను దగా చేసిన వారిని ఏ పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తేలేదని, పిడి చట్టాన్ని ప్రయోగించి కట కటలా వెనక్కి పంపేందుకు వెనుకాడమని పాలకులు 7 హెచ్చరికల మీద హెచ్చరికలు జారీ చేస్తున్నా ఈ నకిలీ విత్తనాల వ్యాపారులు అవేమీ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. యేడాది యేడాదికి ఈ నకిలీ విత్తన వ్యాపారులు దేశవ్యాప్తంగా ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో అంతకంతకు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా వాణిజ్య పంటలైన పత్తి, మిరప లాంటి విత్తనాలతో మోసపోయినప్పుడు రైతులు కోలుకోలేకపోతున్నారు. కూరగాయలకు సంబంధించిన నకిలీ విత్తనాలకు అదుపే లేకుండాపోతున్నది. రసీదులు, బిల్లులు లాంటి ఎలాంటి ఆధారాలు లేకుండా వేలాది క్వింటాళ్ల కూరగాయల విత్తనాలు ఇతర రాష్ట్రాల నుంచి వివిధ మార్గాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లోకి తెప్పించుకొని ఇష్టానుసారంగా అమ్ముకుంటున్నారు. రైతులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే అన్నదాతలనే సముదాయించి రాజీమార్గాలను అన్వేషిస్తున్నారే తప్ప నిర్దిష్టమైన చర్యలవైపు అడుగులు వేయలేకపోతున్నారు. ఎక్కడో మారుమూల గ్రామా ల్లో ఈ నకిలీ వ్యాపారం జరగడంలేదు. అన్ని నగరాల్లో నూ, పట్టణాల్లోనూ బహిరంగంగానే జరుగుతున్నది. మొన్న ఖరీఫ్లో కూడా భారీఎత్తున ఈ నకిలీ విత్తనాలు రైతులను నిలువునా ముంచాయి. ప్రభుత్వపరంగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా విత్తనాల కొరత దృష్ట్యా ఈనకిలీ వ్యాపారులపై ఆధారపడడం తప్పడం లేదు. ఈ వ్యాపారాన్ని అడ్డుకునేందుకు గత రెండు, మూడు దశా బ్దాలుగా పాలకులు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం కావడం లేదు. పోలీసులన్నా, చట్టాలన్నా, వ్యవసాయ శాఖ అధికా రులన్నా భయభక్తులు లేకుండాపోయాయి. ఇందుకు ఇతర కారణాల కంటే అసలు విత్తన చట్టమే రైతులకంటే దళారులకే ప్రయోజనకరంగా ఉండడం వల్లనే ఈ పరిస్థితులు దాపురిస్తున్నాయి. కొత్త పటిష్ట మైన చట్టం కావాలని రైతులు ఏనాటి నుంచో కోరు తున్నా కార్యరూపం దాల్చడం లేదు. ఎట్టకేలకు ఇటీవల కేంద్రప్రభుత్వం ఈ చట్టంలో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నాలు ఆరంభించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా అభిప్రాయాలు సేకరిస్తున్నది. వాస్తవంగా మన దేశంలో విత్తనచట్టం (Seed Act)1966 నాటిది. 1983లో విత్తననియంత్రణ ఉత్తర్వులను అప్పటి కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. పర్యావరణాన్ని పరీక్షించాల్సిన చట్టం 1986లో తీసుకువచ్చారు. ఎన్నిచట్టాలు తెచ్చినా, మరెన్ని నిబంధనలు విధించినా అవి విత్తన కంపెనీలకు, మరికొందరు దళా రులకు ప్రయోజనకరంగా ఉన్నాయనే విమర్శలు ఏనాటి నుంచో ఉన్నాయి. మన దేశంలో అసలు విత్తనాలు ఎలా తయారు చేస్తున్నారు? వారికున్న వనరులు ఏమిటి? సిబ్బంది ఎంత? తదితర వివరా లేమీ ప్రభుత్వాలు పట్టిం చుకోకపోవడం, పర్యవేక్షించకపోవడంతో ఈ దురదృష్టపు పరిస్థితులు
ఏర్పడుతున్నాయి. విదేశాల్లో విత్తనాల మోసా లను పకడ్బందీగా నియంత్రించడమే కాదు, రైతులను మోసగిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నారు. చైనా లాంటి దేశంలో వారు తీసుకుంటున్న చర్యల కారణంగా నకిలీ, నాసిరకం విత్తనాలు లేకుం డాపోయాయి. ప్రభు త్వమే నాణ్యమైన విత్తనాలను రైతులకు అందిస్తున్నది. మనదేశంలో ఆ పరిస్థితులు లేవు. దేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల్లో అధికశాతం విత్తనాల్లో మోసపో యినవారే ఉన్నారు. రైతుల సంక్షేమమే తమ ధ్యేయమని వాచావాత్సల్యమే కాదు కావల్సింది చేతల్లో చూపాలి. అందుకు ముందుగా రైతులకు రక్షణగా ఉండే విత్తన చట్టమే (Seed Act) ఈ సంక్షోభానికి కొంత పరిష్కారం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: