📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Street Vendors : చిరువ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ – మంత్రి నారాయణ వెల్లడి

Author Icon By Shravan
Updated: August 11, 2025 • 10:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నెల్లూరు (Street Vendors) : నిరుపేద రికం నుండి వచ్చాను కాబట్టే పేదల కష్టాలు తెలుసని, అందుకే తన సొంత నిధుల నుండి నిరుపేదలకు సహాయం (Help for the poor) అందిస్తున్నానని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. గోమతి నగర్ క్యాంపు కార్యాలయంలో తోపుడు బండ్ల పంపిణీ కార్యక్ర మం జరిగింది. చాలా మంది చిరు వ్యాపారులు సంపాదనలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అండగా నిలిచేందుకు తన వంతు సాయంగా తోపుడు బండ్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఒక్క రోజే 47 మంది పేదలకు తోపుడు బండ్లు అందజేశామని తెలిపారు. అందులో 41 తోపుడు బండ్లు, ఐదు ఇస్లీ బండ్లు, ఒకరికి రిక్షా అందిం చినట్లు తెలిపారు.
నేను తాటాకు గుడిసెలో పుట్టానని కడు పేదరికాన్ని అనుభవించాను కాబట్టే కష్టపడి ఈ స్థాయికి వచ్చానన్నారు. పేదల కష్టాలు తెలుసుకున్నాను తెలుసుకున్నాను కాబట్టే కాబట్టే నా వంతు సహాయం అందిస్తున్నానని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో వీధి వ్యాపారుల జీవనశైలి చూశానని, అద్దెకు బండి తీసుకొని వ్యాపారాలు చేసుకొని ఇబ్బందులు పడ్డారని, అందుకే అద్దె చెల్లించే అవసరం లేకుండా తోపుడు బండ్లు అందజేశానని మంత్రి తెలిపారు. నిరుపేద పిల్లల కోసం వీఆర్సీని అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేశామన్నారు. దానిపైన కూడా కొందరు విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని చేసినా నా సంకల్పం ఆగదని మంత్రి తెలిపారు.

వచ్చే విద్యా సంవత్సరానికి 12 హైస్కూల్ను వీఆర్సీ తరహాలోని సిద్ధం చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. సీఎం మానసపుత్రిక అయినటువంటి పీ 4 కింద పేదలకు చేయూత ఇవ్వాలని, నా పిల్లలు కూడా సంకల్పించారని తెలిపారు. మాది పేదల ప్రభుత్వం అని అన్నారు. భగత్ సింగ్ కాలనీవాసుల శాశ్వత పట్టాలు పంపిణీ ఓ నిదర్శనమని మంత్రి నారాయణ తెలిపారు. దశాబ్దాల కల నెరవేరడంతో వారి ఆనందానికి అవధులు లేవన్నారు. నెల్లూరు సిటీని మోడల్ సిటీగా తీర్చి దిద్దుతానని ఇచ్చిన హామీలను ఒక్కోడిగా నెరవేరుస్తామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్ళపాక అనురాధ, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు. క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ప్రెసిడెంట్లు, టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/polling-centers-polling-centers-that-are-against-the-rules/andhra-pradesh/528702/

Andhra Pradesh Government Breaking News in Telugu Google news Latest News in Telugu Minister Narayana Small Business Support Street Vendors Urban Development

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.