తెలుగు రాష్ట్రాల్లో వీధికుక్కల(Street Dogs) బెడద రోజురోజుకు మరింత తీవ్రరూపం దాలుస్తోంది. పట్టణాలు, చిన్న చిన్న మండల కేంద్రాలు, గ్రామాలు ఎక్కడ చూసినా కుక్కల దాడులు పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. స్థానిక సంస్థలు చేపడుతున్న చర్యలు సరిపోకపోవడంతో ప్రజలు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు.
Read also: AP: ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డికి జైలు శిక్ష
రాయచోటిలో విషాదం: బైక్ అదుపుతప్పి గోడను ఢీకొట్టిన ఫజిల్
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని రాయచోటిలో జరిగిన విషాద ఘటన ఈ బెడద తీవ్రతను మరింత స్పష్టంగా చూపించింది. అక్కడ నివసించే ఫజిల్ (42) అనే వ్యక్తి రాత్రి సమయంలో తన బైక్‌పై ఇంటికి వెళ్తుండగా అకస్మాత్తుగా కొన్ని వీధికుక్కలు అతన్ని వెంటపడ్డాయి. కుక్కలు ఆకస్మికంగా, బైక్‌కు దగ్గరగా రావడంతో ఫజిల్ గాబరాపడి నియంత్రణ కోల్పోయారు. బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోడకు బలంగా ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుక్కల నియంత్రణపై పట్టణపాలక సంస్థ తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఒక్కరోజులో 36 మందిపై దాడి… గ్రామస్తుల ప్రతికారం
ఇక తెలంగాణలో పరిస్థితి మరింత భయంకరంగా మారింది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలంలో ఒకే ఉన్మాద కుక్క గ్రామమంతా తిరుగుతూ ఒక్కరోజులో 36 మందిపై దాడి చేసి గాయాలపాలు చేసింది. పెద్దలు, మహిళలు, చిన్నపిల్లలు ఎవరినీ వదల్లేదని గ్రామస్థులు చెబుతున్నారు. కొంతమంది గాయపడిన వారు చేతులు, కాళ్లపై లోతైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో భయాందోళన నెలకొనడంతో చివరకు గ్రామ పెద్దలు, యువకులు కలిసి ఆ కుక్కను గుర్తించి హతమార్చారు.
మున్సిపాలిటీల నిర్లక్ష్యమేనా?
ఈ ఘటనల నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వాలను, మున్సిపాలిటీలను తమ ప్రాంతాల్లో వీధికుక్కల సంఖ్యను నియంత్రించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. స్టెరిలైజేషన్ కార్యక్రమాలు, వ్యాక్సినేషన్, కుక్కలను ఆశ్రయ కేంద్రాలకు తరలించడం వంటి కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించకపోతే ఇలాంటివి మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: