📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Stray dogs: ప్రాణాల కంటే హక్కులే ముఖ్యమా?

Author Icon By Sudha
Updated: February 4, 2026 • 4:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రమవు తోంది. ఒకప్పుడు అరుదుగా వినిపించిన కుక్కల కాట్ల ఘటనలు, నేడు నిత్య వార్తలుగా మారాయి. చిన్నారులు, వృద్ధులు, పాదచారులు, కార్మికులు ఎవరూ మినహాయింపు కాదు. గాయాలపాలవుతున్న వారి సంఖ్య పెరుగుతుండగా, కొన్నిసందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇది కేవలం జంతు సమస్య మాత్రమే కాదు, ఇది ప్రజారోగ్యం, భద్రత, పాల నకు సంబంధించిన అత్యంత కీలక అంశం. కుక్కలుకరవడం కొత్త విషయం కాదు. అయితే ఇటీవలకాలంలో ఈ ఘట నలు అసాధారణంగా పెరిగాయి. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా వీధుల్లోకుక్కల గుంపులు స్వైరవిహారం చేస్తు న్నాయి. రాత్రివేళల్లో బయటకు రావడానికే ప్రజలు భయ పడే పరిస్థితి నెలకొంది. స్కూల్కు వెళ్లే పిల్లలు, పనికి వెళ్లే మహిళలు, వృద్ధులు తమ ప్రాణభద్రతపై ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో రేబీస్ వంటి ప్రాణాంతక వ్యా ధుల ముప్పు కూడా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభు త్వాలు, మున్సిపల్సంస్థలు తమ బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తున్నాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. జంతు జనాభా నియంత్రణ, టీకాలు, ఆశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు కాగితాలకే పరిమితమవుతున్నాయన్న విమ ర్శలు వినిపిస్తున్నాయి. ప్రణాళికలున్నా, అమలు లోపించ డంతో సమస్య మరింత జఠిలమవుతోంది. ఇలాంటి నేపథ్యంలో వీధి కుక్కల నిర్వహణపై సుప్రీంకోర్టు కొన్ని కీలక సూచనలు చేయడం గమనార్హం. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, స్థానికసంస్థలు బాధ్యత తీసుకోవాలని, నియంత్రణ చర్యలను బలోపేతం చేయాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ సూచనలను జంతు ప్రేమిక సంఘా లు తీవ్రంగా ఖండించడం మరో వివాదానికి దారి తీసింది. జంతు ప్రేమికుల వాదన కూడా పూర్తిగా విస్మరించదగినది కాదు.

Read Also: http://World Cancer Day 2026: నేడు వరల్డ్ క్యాన్సర్ డే

Stray dogs

కుక్కలు కూడా జీవులు, వాటికి జీవించే హక్కు ఉందని వారు అంటున్నారు. అక్రమంగా లేదా అమానుషంగా కుక్కలను చంపడం మానవత్వానికి విరుద్ధమని హెచ్చరిస్తు న్నారు. కుక్కలను చంపితే కేసులు పెడతామన్న హెచ్చరికలూ వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక కీలకప్రశ్న తలెత్తుతోంది. జంతు హక్కుల పేరుతో మానవ ప్రాణాలు విలువను తక్కువ చేయవచ్చా? మానవ జీవితం అత్యున్నతమైనది అనే సత్యాన్ని ఎవ్వరూ విస్మరించలేరు. ఒకచిన్నారి ప్రాణం పోయిన తర్వాత, కుక్కలకూ హక్కులున్నాయి అనే వాదన బాధిత కుటుంబాలకు ఓదార్పునిస్తుందా? జంతు ప్రేమ మానవ భద్రతను మింగేయకూడదు. ఇక్కడ అవసరమైంది వైఖరులు కాదు, సమతుల్య దృక్పథం. వీధి కుక్కల(Stray dogs) సమస్య కు పరిష్కారం కేవలం చంపడంలో లేదు, అలాగే పూర్తిగా వదిలేయడంలో కూడా లేదు. శాస్త్రీయంగా, మానవీయంగా సమస్యను ఎదుర్కోవాలి. జనాభా నియంత్రణ కోసం సమర్థవంతమైన స్టెరిలైజేషన్ కార్యక్రమాలు, నిరంతర టీకాలు, ప్రత్యేక ఆశ్రయ కేంద్రాల ఏర్పాటు, చెత్త నిర్వహణలో క్రమ శిక్షణ ఇవన్నీ సమగ్రంగా అమలుచేయాల్సినఅవసరంఉంది. కుక్కలకు ఆహారం పెట్టేవారు కూడా బాధ్యతతో వ్యవహరించాలి. జనసాంద్రత ఉన్నప్రాంతాల్లో గుంపులుగా ఆహారం పెట్టడం ప్రమాదాలకు దారితీస్తుందన్న అవగాహన కల్పించాలి. ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, జంతు ప్రేమికులు, ప్రజలు అందరూకలిసి ఆలోచించినప్పుడేపరిష్కారంసాధ్యం. ఒకరి మీద ఒకరు నిందలువేయడంవల్ల సమస్య పరిష్కారంకాదు. ప్రజల ప్రాణభద్రతతో రాజీపడకుండా, జంతువుల పట్లమాన వత్వాన్ని కాపాడటం సాధ్యమే. చివరగా ఒక మాట వీధి కుక్కల (Stray dogs)సమస్యమన నాగరికతకు పరీక్ష. ఈపరీక్షలో మనం మానవత్వాన్ని కోల్పోకుండా, మానవ జీవితాన్ని కాపాడగలి గితేనే నిజమైన పరిష్కారం సాధించినట్టవుతుంది.
-తిప్పర్తి శ్రీనివాస్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

animal rights Breaking News dog menace Human Life latest news Public Safety Stray Dogs Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.