📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu news : Stray dogs : వీధి కుక్కల బెడద తప్పేనా?

Author Icon By Sudha
Updated: November 11, 2025 • 3:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నడిరోడ్డు మీద స్వైరవిహారం చేసే కుక్కల భారినపడకుండా తప్పించుకోగలిగిన మానవ మాత్రుడెవరూ ఉండరు. వీధి కుక్కల నియంత్ర ణపై పదేపదే తర్జన భర్జన పడటం తప్పడం లేదు. వీధి కుక్కలపై సుప్రీంకోర్టు మరోసారి జోక్యం చేసుకోవా ల్సి వచ్చింది. వీధి కుక్కల (Stray dogs) బారినపడి రేబిస్ వ్యాధితో మృతిచెందిన కొన్ని కేసులగురించి ఇప్పటికే న్యాయస్థానం ముందుకు రావడంతో గతంలో ఒకసారి సుప్రీంకోర్టు తీవ్రంగా ఆలోచించి కొన్ని కీలకనిర్ణయాలు ప్రకటించింది. అయినప్పటికీ ప్రభుత్వ సంస్థలు కలిసి రాకపోవడం, నిష్రయాపర్వాతం కారణంగా తమ తొలి ఆదేశాలు పట్టించుకోకపోవడంతో ధర్మాసనం కాస్త ఆగ్రహించినా కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. పౌరుల భద్రత, చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారి రక్షణ రీత్యా ఈ కొత్త మార్గదర్శకాలు వీధికుక్కల (Stray dogs) బెడదను కాస్తయినా తగ్గించే వీలుంది. విద్యాసంస్థలు, బస్ స్టేషన్లు, రైల్వే ప్రాంగణాలు, క్రీడాసముదాయాల్లో ఎక్కడపడితే అక్కడ వీధి శునకాలు ప్రత్యక్షమవుతుంటాయి. వాటిని ఏమాత్రం అదిలించినా వాటి పక్కనే వెళ్తున్నప్పుడు ‘తమ మీదకే వస్తున్నారేమోనన్న’ భీతి కలిగినా అవి మానుషుల మీద దాడి చేస్తున్నాయి. ఈ కారణంతో రోజూ వీధి కుక్కల కాట్లకు ఆస్పత్రులపాలైన ఘటనలు ఎన్నో నమో దవుతున్నాయి. అరుదుగా కాదు తరచుగా అత్యంత కీలకంగా ఉన్న ప్రాంతాల నుండి అత్యవసరంగా వీధికుక్కల ను షెల్టర్లకు తరలించాలి. వాటిని సంతానోత్పత్తి నియం త్రణ శస్త్ర చికిత్స చేసిన తర్వాత తిరిగి అవి నివసిస్తున్న పాత ప్రాంతంలో వదిలిపెట్టరాదు. వీధి కుక్కల స్వైర విహారాల గురించి చెప్పుకోవాలంటే శనివారం ఒక్కరోజే హైదరాబాద్ నగరంలోని బాలానగర్ లో కనీసం 25 మందిని వీధికుక్కలు కరిచాయి. ఆయా ప్రాంతాలన్నీ జనసమ్మర్థంగా ఉంటాయి. అలాంటి చోట చిన్న సంఘ టనలేమీ నమోదవవు. భీతిల్లి ఎక్కువ మందినే కరచు కుంటూ వెళ్తాయి. రాష్ట్రప్రభుత్వాలతోపాటు జాతీయ రహదారుల శాఖ, స్థానికసంస్థలు, హైవే గస్తీ బృందాలు తమ ఆదేశాలను తక్షణమే అమల్లోకి తేవాలని సుప్రీం ధర్మాసనం జిస్టస్ విక్రమనాధ్, జస్టిస్సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మా సనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల భద్రతే తమకు ముఖ్యమని తేల్చి చెప్పిన ధర్మాసనం ప్రభుత్వ సంస్థల ను కూడా హెచ్చరించింది. రెండు వారాల్లోగా ఈ చర్యలను చేపట్టాలని కోరింది. ఆయా ప్రధాన సంస్థలకు ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను ఆదేశించింది. సాధారణంగా రాష్ట్రప్రభుత్వాలు ఆర్థిక భారం పేరిట వీధి కుక్కల నియంత్రణకు నిధుల్లేవనే సాకుతో మిన్నకుంటాయి. ఈసారలా కాదు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుంది. కనుక నిధుల్లేవనే సమస్య ఎదురు కాబోదు. అందుచే ఈ సంస్యకు ఒక పరిష్కారం దొరుకుతున్నట్లే. యానిమల్ బర్త్ కంట్రోల్ నిబంధనల ప్రకారం వాటికి వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేయించడం ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్న ట్లు ఆయా సంస్థల అధికార్లు ప్రతి మూడు నెలలకోసారి నిర్దేశిత జనసమర్ధ ప్రాంతాలను తనిఖీచేయాల్సి ఉంటుం ది. ఆ ప్రాంతంలో కుక్కలు లేవని నిర్ధారించుకోవాల్సి ఉం టుంది. ఈ ప్రాంతంలో కుక్కలను దూరప్రాంతానికి తీసు కుపోయినా మరో ప్రాంతం నుంచి కొత్తకుక్కలు అక్కడకు చేరతాయని, అది నిబంధనలకు విరుద్ధమని కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినా కోర్టు తోసిపుచ్చింది. ఇదే సం దర్భంలో రోడ్లపై స్వైర విహారం చేసే పశువుల్నికూడా ఎనిమిది వారాల్లోగా నియంత్రించాలని ప్రభుత్వాన్ని ఆదే శించింది. రానురాను వీధికుక్కల సమస్య పెరిగిపోవడం తో సుప్రీం ఆదేశాలు అమలు చేయకతప్పని పరిస్థితి ఏర్పడింది. కేంద్రప్రభుత్వ గణాంకాల ప్రకారం గత సంవత్స రంలో సగటున రోజుకి 10వేల మందిని కరిచాయి. దేశ వ్యాప్తంగా 2024లో 37,15,713 కుక్క కాటు కేసులు నమోదైనాయి. 2025 జనవరిలోనే 4.29 లక్షల మంది వీధికుక్కల బారినపడ్డారు. 2022-24ల మధ్య అత్యధిక కుక్కకాటు కేసులు నమోదైన పది రాష్ట్రాలలో మహారాష్ట్ర (13.5లక్షలతో) ప్రథమ స్థానంలో ఉంది. తెలంగాణ 3.33 లక్షల కేసులతో ఎనిమిదో స్థానంలో ఉంది. ప్రపంచవ్యా ప్తంగా జరిగే రేబిస్ మరణాల్లో 36శాతం భారతదేశానివే. ఇంకా విశేషంగా చెప్పాలంటే మన దేశ జనాభా కన్నా వీధిశునకాలు ఎక్కువగా ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు యాంటీ రేబిస్ వ్యాక్సిన్లను నిల్వ ఉంచుకోవాలి. తమ ప్రాంగణాలు శుభ్రంగా ఉంచుకు ని, వీధికుక్కలు ప్రవేశించకుండా చూసేందుకు ఆయా సంస్థలు నోడల్ అధికారిని నియమించుకోవాలని సర్వోన్న త న్యాయస్థానం ఇచ్చినమార్గదర్శకాల జాబితాలో ఉంది. ప్రాంగణాల చుట్టూ ప్రహారీలు, కంచెలు, గేట్లనిర్మాణంవంటి పనులను రివారాల్లోగా నిర్మాణాలను చేపట్టాలని ఆదేశిం చింది. కుక్కల నియంత్రణలో స్థానికసంస్థలు కొన్ని జాగ్ర త్తలు తీసుకున్నా అనేక కారణాల రీత్యా అవేమీ అమలు జరగడం లేదు. ఒకవేళ ఔత్సాహిక యాజమానికార్యనిర్వాహంగా చురుకుగా ఉన్న చోట్లవీటిని పాటించినా ప్రజల్నుం చి ప్రభుత్వంనుంచి తగు ఒత్తిడిఉంటే తప్ప ఇలాంటివి ముందుకుసాగే కార్యక్రమాలు కాబోవు. గతంలోనే ధర్మాస నం ప్రభుత్వఉద్యోగుల కాలనీల్లో కుక్కకాటుకు గురవుతు న్న ప్రజల ఆక్రందనలు వినిపించుకుని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రజలు, ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలుమూకు మ్మడిగా కుక్కల నియంత్రణకు నడుం కడితేతప్ప కుక్కల భారినుంచి జనాన్ని కాపాడుకోవడం సాధ్యంకాదు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

animal control Breaking News dog menace latest news Public Safety Stray Dogs street dogs Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.