రాష్ట్ర అభివృద్ధి పథంలో పయనాలంటే కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండే ‘డబుల్ ఇంజిన్ సర్కారు’ అనివార్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో జరిగిన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న మెజారిటీ అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులతోనే సాధ్యమవుతున్నాయని గుర్తు చేశారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులు క్షేత్రస్థాయిలో సర్పంచులకు అందకుండా గత ప్రభుత్వాలు అడ్డుకున్నాయని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం రావాలని ఆయన పిలుపునిచ్చారు.
Madras HC: చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన
గత పదేళ్ల కాలంలో తెలంగాణ పాలన అస్తవ్యస్తంగా మారిందని, బీఆర్ఎస్ మరియు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కిషన్ రెడ్డి విమర్శించారు. గత పదేళ్లలో రెండు ప్రభుత్వాలు కలిసి సుమారు రూ. 10 లక్షల కోట్ల అప్పులు చేశాయని, ఈ భారం సామాన్య ప్రజలపై పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల హయాంలో జరిగిన అవినీతి వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని, ప్రజల సొమ్మును దోచుకున్న ఆస్తులను కాపాడుకోవడానికే కేసీఆర్ కుటుంబం ఇప్పుడు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తోందని ఆయన ఘాటుగా విమర్శించారు. అభివృద్ధి కంటే సొంత ప్రయోజనాలకే వారు ప్రాముఖ్యత ఇచ్చారని మండిపడ్డారు.
ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనపై కూడా కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిస్థితి మరింత ‘ఆగమైందని’, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. పరిపాలన గాడి తప్పిందని, అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని విమర్శించారు. గత ప్రభుత్వాల తప్పులను సరిదిద్దాల్సింది పోయి, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తూ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. కేవలం కేంద్ర నిధులపైనే ఆధారపడటం తప్ప, రాష్ట్ర సొంత వనరులను పెంచే ఆలోచన ఈ ప్రభుత్వాలకు లేదని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com