ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్(SS Thaman) తాజాగా ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్(Naralokesh)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ గురించి తమన్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. లోకేశ్‌తో జరిగిన సమావేశం ఎంతో సానుకూలంగా, స్ఫూర్తిదాయకంగా సాగిందని ఆయన పేర్కొన్నారు.
Read also: VB-G RAM G: ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు!
లోకేశ్‌ను ప్రేమతో ‘అన్న’గా సంబోధించిన తమన్
తన పోస్ట్‌లో నారా లోకేశ్‌ను ప్రేమతో ‘అన్న’గా సంబోధించిన తమన్, ఆయనతో జరిగిన చర్చ తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. రాబోయే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL)తో పాటు సంగీతం, కళలకు సంబంధించిన కొన్ని కొత్త ఆలోచనలు, ప్రాజెక్టులపై ఈ సమావేశంలో మాట్లాడినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నారు.
తమన్(SS Thaman) షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం సహకారంతో భవిష్యత్తులో తమన్ ఏవైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: