📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Srivani Trust: శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాల నిర్మాణానికి నిధులు పెంపు

Author Icon By Ramya
Updated: July 23, 2025 • 10:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోబాటు ఇతర ప్రాంతాల్లోనూ సనాతన హిందూ ధర్మాన్ని మరింత విస్తృతంగా జనబాహుళ్యంలోనికి తీసు కెళ్ళేందుకు మతమార్పిడులను అరికట్టేందుకు శ్రీవాణిట్రస్ట్ (Srivani Trust) ద్వారా నిర్మించే ఆలయాలకు నిధులు మూడు కేటగిరీలుగా విడుదల చేయనున్నారు. ఇందుకు దీనిపై సుదీర్ఘంగానే చర్చించిన ప్రస్తుత టిటిడి పాలకమండలి పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకుంది. మారుమూల గ్రామాల్లోనేగాక ఎస్సీ, ఎస్టీ వెనుక బడిన ప్రాంతాలు, గిరిజన తాండాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించాలని టిటిడి ఇప్పటికే ఆమోదించింది. ఈ ఆలయాల నిర్మాణాలు పక్కాగా నిర్వహించేందుకు శ్రీవాణి ట్రస్ట్ (Srivani Trust) నిధులు ఇది వరకు 10 లక్షల రూపాయలు మాత్రమే విడుదలయ్యేది. ఈ నిధులు విడుదల ఇప్పుడు మూడు కేటగిరీల్లో చేపట్టనున్నారు. మంగళ వారం తిరుమల అన్నమయ్యభవనంలో టిటిడి పాలకమండలి సమావేశం జరిగింది. టిటిడి (TTD). చైర్మన్ బిఆరా నాయుడు, శ్యామలరావు, అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి నేతృత్వంలో శ్రీవాణిట్రస్ట్ ద్వారా ఆలయాల నిర్మాణంపై సమీక్షించి అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నిరాదరణకు గురైన ఆలయాల ధూప దీపనైవేద్యాల నిర్వహణకు ప్రణాళికలు, వెనుకబడిన ప్రాంతాల్లో నిర్మించిన ఆలయాలకు అవసరమైన నిదులు కేటాయింపుపై సమీక్షించారు.

Srivani Trust: శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాల నిర్మాణానికి నిధులు పెంపు

శ్రీవాణి ట్రస్ట్ నిబంధనల్లో కీలక మార్పులు

శ్రీవాణి ట్రస్ట్లో ప్రస్తుతం ఉన్న నిబంధనలను పునఃసమీక్షించి 10 లక్షలు రూపాయలకు బదులు మూడు కేటగిరీల్లో 10లక్షలు రూపాయలు, 15లక్షలు, 20లక్షల రూపాయలుగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఒకే కేటగిరి క్రింద చెల్లించే 10లక్షల రూపాయల్లో మార్పుచేశారు. సనాతనధర్మాన్ని జనంలోకి తీసుకెళ్ళేందుకు ఆలయాల నిర్మాణాలు పునాదుల్లాంటివని, ఆలయాల నిర్మాణాలతో దైవచింతన, ఆధ్యాత్మికత, సేవాభావం సమభావంతో మానవ సంబంధాలు పెరుగుతాయని బోర్డు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇప్పటికే సమరసత సేవా ఫౌండేషన్, దేవాదాయశాఖ సంయుక్తంగా నిర్మిత మవుతున్న ఆలయాల ప్రస్తుత స్థితి, జీర్ణోద్ధారణ పనులు ఏ దశలో ఉన్నాయోనని కూడా చర్చించారు. రాష్ట్రదేవాదాయశాఖ (State Endowments Department) ఆదేశాలతో శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్సీ,ఎస్టీ వెనుక బడిన ప్రాంతాల్లో నిర్మించే శ్రీవారి ఆలయాలు భజన మందిరాలకు నిధులు చెల్లించేందుకు ఈ మూడు కేటగిరీలు దోహదపడుతాయి. ఇప్పటి వరకు నిర్మించిన 320 ఆలయాలకు 79.82 లక్షల రూపాయలతో మైక్సెట్లను ఉచితంగా అందించేందుకు నిర్ణయించారు.

విదేశాల్లో ఆలయ నిర్మాణాలకు సబ్‌కమిటీ

వివిధ దేశా ల్లోనూ ఆలయాలను నిర్మించాలని ఇందుకు సబ్కమిటీ ఏర్పాటుచేయాలని ఆమోదించారు. తిరుమలలో పాతబడిన పురాతన విశ్రాంతి భవనాలు, కాటేజీలను ఐఐటి నిపుణుల సూచన లతో తొలగించి ఆ స్థానంలో పునఃనిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమల విజన్ 2047 అమలులో వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం దేశం నలుమూలల నుండేగాక విదేశాల నుండి విచ్చేస్తున్న భక్తులకు వసతి, దర్శన సదుపా యాలు మరింత సులభం చేయడానికి వీలుగా అలిపిరి వద్ద బేస్ క్యాంపు ఏర్పాటుకు టిటిడి బోర్డు నిర్ణయించింది. భక్తులకు వసతి సౌకర్యంతో బాటు దర్శన టిక్కెట్లు, టోకెన్లు జారీచేసే కౌంటర్ల ఏర్పాటు చేయాలని ఆలోచనకు శ్రీకారం చుట్టనున్నారు. ఆధ్యాత్మిక, ఆహ్లాద వాతావరణం నెలకొల్పేలా చూడనున్నారు. ఈ బోర్డు సమావేశంలో టిటిడి అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి, వీరబ్రహ్మం, బోర్డుసభ్యులు భానుప్రకాశ్ రెడ్డి, సి. దివాకర్రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, సుచిత్ర ఎల్లా, శాంతారాం. జాస్తిపూర్ణసాంబశివరావు, సదాశివరావు, ఎన్. నర్సిరెడ్డి, జ్యోతులనెహ్రూ, ఎంఎస్ రాజు, పనబాక లక్ష్మి, మునికోటేశ్వర రావు, దర్శన్ , టిటిడి జెఇఒ వీరబ్రహ్మం, సివిఎస్, కెవి మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఇఒ లోకనాథం, సిపిఆర్ ఒ డాక్టర్ తలారి రవి తదితరులు పాల్గొన్నారు..

శ్రీవాణి ట్రస్ట్ ఉద్దేశం ఏమిటి?

దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో, ముఖ్యంగా ఎస్సీ / ఎస్టీ / బీసీ మరియు బలహీన వర్గాల కాలనీలలో, మత మార్పిడులకు ఎక్కువగా గురయ్యే ప్రాంతాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించడానికి శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేయబడింది.

శ్రీవాణి ట్రస్ట్ యజమాని ఎవరు?

ఎస్సీ-ఎస్టీ-బీసీ నివాసాలలో ఆలయాలను నిర్మించడం, పురాతన దేవాలయాలను పునరుద్ధరించడం మరియు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేవాలయాలకు ధూప్-దీప-నైవేద్యం పథకం కింద నిధులు అందించడం ద్వారా సనాతన ధర్మాన్ని ప్రోత్సహించడానికి 2019లో టీటీడీ శ్రీవాణి ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది.

శ్రీవాణి ట్రస్ట్ ఎందుకు రద్దు చేయబడింది?

శ్రీవాణి ట్రస్ట్‌లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్ట్ ప్రతి యాత్రికుడి నుండి రూ. 10,000 వసూలు చేస్తోంది. శ్రీవెంకటేశ్వర స్వామి ప్రత్యేక దర్శనం కల్పించేందుకు ఈ ట్రస్ట్ కృషి చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Nano fertilizers: నానో ఎరువుల వినియోగానికి సబ్సిడీ ప్రతిపాదనలేదు

Breaking News Hindu Dharma latest news Srivani Trust Telugu News Temple Construction Tribal Development TTD Updates

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.