‘సృష్టి’ కేసులో తవ్వేకొద్దీ అక్రమాలు
విశాఖ క్రైమ్ : సృష్టి ఫెర్టిలిటీ కేసు రాష్ట్రవ్యాప్తంగాసంచలనం సృష్టిస్తోంది. శిశువుల అక్రమరవాణా, మధ్యవర్తుల హస్తంతో నడిచిన ఈ అమానవీఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజిహెచ్) కుచెందిన ఇద్దరు వైద్యులను గోపాలపురం పోలీసులు గురువారం అరెస్ట్ చేయగా వారిలో మత్తు వైద్య విభాగాధిపతి డాక్టర్ వాసుపల్లి రవి కుమార్, ప్రసూతి విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉషాదేవి (Assistant Professor Usha Devi) ఉన్నారు. ఇక వాసుపల్లి రవి కుమార్ మాజీ ఎమ్మెల్యే తమ్ముడు కావడంతో ఈ కేసులో మరోరాజకీయ కోణాన్ని తీసుకురాబోతుంది. ఇదివరకు ఇదే కేసులో అరెస్టయి, బెయిల్పై విడుదలైన డాక్టర్ విద్యుల్లత కూడా కేజిహెచ్ పిల్లల విభాగంలో పనిచేశారు. ఈ వైద్యులు కేజీహెచ్లో విధులు నిర్వహిస్తూనేఖిసృష్టిఖి ఫెర్టిలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించేవారనిఆరోపణలు ఉన్నాయి.
దర్యాప్తులో బయటపడ్డ వివరాల ప్రకారం
కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్వాణి ఈ అరెస్టులపై తనకు వివరాలు తెలియవనితెలిపారు. డాక్టర్ వాసుపల్లి రవి కుమార్ గత మూడురోజులుగా సెలవులో ఉన్నట్లు సమాచారం.ఇక మరో వైపు, ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత (Dr. Namrata) తోసంబంధాలు కలిగి ఉన్న ఇద్దరు వైద్యులు డాక్టర్ రమ్య, డాక్టర్ రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతోఇప్పటివరకు ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 28కి చేరింది. దర్యాప్తులో బయటపడ్డ వివరాల ప్రకారం, సరోగసి పేరుతోడాక్టర్ నమ్రత ఇప్పటి వరకు సుమారు 50 మంది బాధితువద్ద నుంచి రూ.20 కోట్లకు పైగా వసూలు చేశారు. మరోకీలక నిందితురాలు సంతోషి ఏజెంట్ల ద్వారా 18 మందిశిశువులను సేకరించినట్లు తేలింది. ముఖ్యంగా గిరిజన మహిళలను ప్రలోభపెట్టి వారి నుంచిశిశువులను రూ.5 లక్షలకు కొనుగోలు చేసి, తక్లయింట్లకు ఒక్కో శిశువును రూ.50 లక్షలకు విక్రయించినట్లు వెల్లడైంది.
పోలీసులు విచారణలో భాగంగావిశాఖలో
మొత్తం 80 మంది పిల్లలనుఅమ్మిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోపోలీసులు డాక్టర్ నమ్రత బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. తల్లులను గుర్తించి శిశువులను తిరిగి వారికి అప్పగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖలో శిశువుల అక్రమ రవాణా: విశాఖ కేంద్రంగా జరిగిన ఈ స్కాంలో ఇప్పటి వరకూఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా, హైదరాబాద్ పోలీసులు విచారణలో భాగంగా,విశాఖలో ముగ్గురు మధ్యవర్తులు అయిన విజయ్, సరోజ, రత్నాను అరెస్టు చేశారు. ఈ మధ్యవర్తులు శిశువులకొనుగోలు, అమ్మకాల్లో కీలకంగా వ్యవహరించినట్లు ఆధారాలు లభించాయని సమాచారం. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారంలో నవజాత శిశువులను పేద కుటుంబాల నుంచి తీసుకొని దరఖాస్తు చేసుకున్న జంటలకు పెద్ద మొత్తాలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఇది పూర్తిగా వ్యాపార ధోరణితో నడిచిన శిశువుల అక్రమ ముఠాగా భావిస్తున్నారు.
ఫెర్టిలిటీ సెంటర్స్ అంటే ఏమిటి?
ఫెర్టిలిటీ సెంటర్స్ అనేవి సంతానలేమి సమస్యలు ఉన్న దంపతులకు వైద్యపరమైన చికిత్సలు, సాంకేతిక సహాయం అందించే ప్రత్యేక వైద్య కేంద్రాలు.
ఫెర్టిలిటీ సెంటర్స్‌లో ఏవేవి చికిత్సలు అందిస్తారు?
వీటిలో IVF (In Vitro Fertilization), IUI (Intrauterine Insemination), ఎగ్ ఫ్రీజింగ్, స్పెర్మ్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ వంటి సాంకేతికతలు అందిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also :