📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద

Author Icon By Sharanya
Updated: July 21, 2025 • 4:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల

హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఉన్న జలాశయాల నుంచి భారీగా వరద విడుదల చేస్తున్న నేపథ్యంలో మరో మూడు నాలుగు రోజుల్లో శ్రీశైలం జలాశయం (Srisailam Reservoir) నిండుతుందని అధికారవ ర్గాలు అంచనా వేస్తున్నాయి. జూరాల, సుంకేశుల బ్యారేజ్ల (Jurala and Sunkeshula barrages) నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,38,841 క్యూసెక్కులు చేరుతుండగా విద్యుదుత్పత్తి ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 67,488 క్యూసెక్కులను దిగువన సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 20వేల క్యూసెక్కులు, హంద్రీ నీవా కోసం 1,013 క్యూసెక్కులను ఏపీ తీసుకుంటుండగా, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా1,600 క్యూసెక్కులను తెలంగాణ తీసుకుంటోంది.

ఆల్మట్టి డ్యామ్లోకి 94వేల క్యూసెక్కులు

మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా ప్రధాన పాయతో పాటు మలప్రభ, ఘటప్రభలు వరద పోటుత్తుతున్నాయి. దాంతో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్లలోకి వరద ఉధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యామ్లో (Almaty Dam)కి 94వేల క్యూసెక్కులు చేరుతుండగా 90వేల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్లోకి 1.15 లక్షల క్యూ సెక్కులు చేరుతుండగా1.01 లక్షల క్యూసెక్కులను దిగు వకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 1.15 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 1.22 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్కు వస్తున్న 39,339 క్యూసెక్కుల వరదను వచ్చిందొచ్చినట్టుగా దిగువన శ్రీశైలంకు విడుదల చేస్తున్నారు. శ్రీశైల జలాశయం (Srisailam Reservoir) ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు అధికారులు తెలిపిన లెక్కల వివరాల ప్రకారం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయంలో 882.70 అడుగులు – ఉన్నాయి. జలాశయంలో నీటి సామర్థం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో నీటి సామర్థం 202.9673 టీఎంసీలుగా నమోదయి ఉంది. విద్యుత్ ఉత్పత్తికి కుడి ఎడమల నుంచి 67,488 క్యూసెక్కుల నీటిని సాగరకు విడుదల చేస్తున్నారు. ఏపీ జల విద్యుత్ కోసం32,173 క్యూసెక్కుల నీటిని వాడుతుండగా, తెలంగాణ ప్రాంతం నుంచి 35,315 క్యూసెక్కుల నీటిని జల విద్యుత్ కోసం వినియోగిస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి కృష్ణానది వరద ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్ఎస్పి అధికారులు ఆదివారం ఉదయం ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు.

ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 565 అడుగులకు – చేరుకోవడంతో అధికారులు తాగు నీటి అవసరాల కోసం 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. క్రమంగా 2 వేల క్యూసెక్కులకు పెంచుతూ నీటి విడుదల కొనసాగించనున్నారు. ఎడమ కాలువ కింద ఆయకట్టు రైతులు నీటి విడుదల కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. తాగునీటి కోసమే కాకుండా పంటలకు సాగు నీటిని విడుదల చేయాలని ఆయకట్టు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువ జలాశయాల నుంచి భారీగా వరద వస్తుండడంతో అధికారులు ప్రాజెక్టు 19 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం జూరాలకు 1.15 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 1.07 లక్షల – క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తంది. అందులో స్పిల్ వే ద్వారా 74,081 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 29,464 క్యూసెక్కులు వరద నీటిని వినియోగిస్తున్నారు. దీంతో పాటు ఆయకట్టుపై ఆధారపడిన నెట్టెంపాడు లిప్ట్కు 750 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాలువలకు భీమా లిప్ట్కు 750 క్యూసెక్కులు, కోయిల్సాగర్ – ఎత్తిపోతలకు 315 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు .

Read hindi news: hindi.vaartha.com

read also: Tirumala: మొదటిఘాట్లో ఎలుగుబంటి హల్చల్

Andhra Pradesh Breaking News latest news Srisailam Dam Gates Srisailam Flood Inflow Srisailam Reservoir Srisailam Water Level Telangana Rain Impact Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.