శ్రీశైలంలోని (srisailam) వసతి సౌకర్యాలను ఆన్‌లైన్‌లో బుక్ చేస్తామంటూ కొంతమంది మోసగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు రూపొందించి భక్తులను బలికొడుతున్నారు. AP టూరిజం, శ్రీశైలం దేవస్థానం పేరుతో కనిపించే ఈ ఫేక్ సైట్ల ద్వారా ఇప్పటికే పలువురు డబ్బులు పోగొట్టుకున్నారు.
Read also: AP Crime: అమెరికా వీసా రాలేదని యువతి బలవర్మణం
Alert to Srisailam devotees
దాదాపు ₹30,000 చెల్లించి
Srisailam: తాజా ఘటనలో ఓ భక్తుడు దాదాపు ₹30,000 చెల్లించి రూములు బుక్ చేసుకున్నారు. ఆలయానికి వెళ్లి రశీదు చూపించగా, అది అసలైనది కాదని సిబ్బంది స్పష్టంచేయడంతో అతను షాక్‌కు గురయ్యాడు. ఇలాంటి మోసాలు మరికొందరిపై కూడా జరిగినట్లు తెలిసింది.
ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయడానికి చర్యలు చేపట్టామని దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. అధికారిక వెబ్‌సైట్ కాకుండా ఏ ఇతర లింక్‌లు, పేజీలు ద్వారా బుకింగ్‌లు చేయవద్దని భక్తులకు సూచించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: