News Telugu: Srikalahasti: శివనామస్మరణతో హోరెత్తిన శ్రీకాళహస్తీశ్వరాలయం

Read Time:  1 min
Srikalahasti Temple erupts with the chanting of Lord Shiva
Srikalahasti Temple erupts with the chanting of Lord Shiva
FONT SIZE
GET APP

శ్రీకాళహస్తి: హర హర మహాదేవా అంటూ భక్తులు కీర్తిస్తుండగా ఆలయ అర్చకులు భక్తి భావంతో గంగమ్మ తల్లికి హారతులిచ్చారు. నిండుకుండలా స్వర్ణముఖి నదీ ప్రవహిస్తుండగా కార్తీక మాసం అమావాస్య సందర్భంగా గంగా హారతులతో పునీతమైంది. శ్రీకాళహస్తి దేవస్థానం (Srikalahasteeswara temple) తరఫున కార్తీక మాసం అమావాస్య పవిత్ర దినమైన బుధవారం రాత్రి ‘స్వర్ణముఖి హారతులు’ ఏర్పాటు చేశారు. గంగమ్మ అమ్మవారు, మరో వైపు సోమాస్కంద మూర్తి అయిన శివయ్యలను అంగరంగ వైభవంగా ముస్తాబు చేసి జలవినాయక ఆలయం వద్ద ఏర్పాటు చేశారు. నభూతో అన్నట్లు హారతుల్ని నిర్వహించారు. స్వర్ణముఖి అందాల్ని హరతుల్ని తిలకించటానికి స్థానికులే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు, ప్రజలు తండోపతండాలుగా కదలివచ్చారు.

Read also: Toofan Alert : ఏపీకి మరో తుఫాను ముప్పు

Srikalahasti Temple erupts with the chanting of Lord Shiva

Srikalahasti Temple erupts with the chanting of Lord Shiva

శివనామస్మరణతో దద్దరిలింది.

స్వర్ణ ముఖి తీరం భక్త జనులతో కిటకిట లాడింది. శివనామస్మరణతో దద్దరిలింది. హారతులతో పునీతమైంది. ఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ కుమార్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టె సాయిప్రసాద్, సభ్యులు పగడాల మురళి, లక్ష్మమ్మ, దండి రాఘవయ్య, గాదిపాకుల గోపి, వాకచర రుపశెట్టి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఇఓ డి.బాపిరెడ్డి దంపతులు పాల్గొన్నారు. అర్చకులు రాజేష్ గురుకుల్, కమల్, నిరంజన్ గురుకుల్, పౌరోహితులు అర్ధగిరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తీ ఆలయంలో కార్తీక మాసం అమావాస్య రోజున ఏ కార్యక్రమం జరిగింది?
భక్తులు హరహరమహాదేవా అని శివనామస్మరణతో కీర్తన చేసి, స్వర్ణముఖి నది వద్ద గంగా హారతి చేయబడింది.

ఈ కార్యక్రమంలో ఎవరు పాల్గొన్నారు?
స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల భక్తులు, ఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ కుమార్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టె సాయిప్రసాద్, ఇతర అర్చకులు, పౌరోహితులు పాల్గొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.