📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Srikalahasti: యువకుడి హత్య కేసులో జనసేన వినుత దంపతులు అరెస్ట్

Author Icon By Sharanya
Updated: July 12, 2025 • 4:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీకాళహస్తి (Srikalahasti) జనసేన పార్టీకి చెందిన ఇన్‌ఛార్జ్ కోట వినుత ప్రస్తుతం తీవ్రమైన ఆరోపణలతో వార్తల్లో నిలిచారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైలో చోటుచేసుకున్న ఓ యువకుడి హత్య కేసులో ఆమె పేరును ఆరోపణలతో అనుసంధానించడంతో, జనసేన పార్టీ ఆమెను తాత్కాలికంగా బహిష్కరించినట్లు ప్రకటించింది. ఈ ఘటన పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో అధిష్టానం తక్షణ చర్యలు తీసుకుంది.

హత్య కేసు నేపథ్యం:

చెన్నైలోని కూవంనదిలో లభించిన శ్రీకాళహస్తి (Srikalahasti) యువకుడి మృతదేహాంపై ఆరా తీసిన పోలీసులు జనసేన నేతల హస్తం ఉన్నట్లు గుర్తించారు. శ్రీకాళహస్తి మండలం బక్కిసంపాలెం చెందిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే యువకుడిగా గుర్తించిన తమిళనాడు పోలీసులు. శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జ్ కోటా వినూత (Janasena in-charge quota is Vinutha) వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న రాయుడుగా తేల్చారు. గత కొన్నేళ్లుగా జనసేన ఇన్‌ఛార్జ్ కోటా వినూత, ఆమె భర్త చంద్రబాబు వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న రాయుడు ప్రవర్తన బాగా లేకపోవడంతో తొలగించాల్సి వచ్చింది. ఈ మేరకు గత జూన్ 21 నుంచి డ్రైవర్ రాయుడును విధుల నుంచి తొలగించినట్లు వినూత దంపతులు (Vinutha couple) సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలోనే రాయుడు అదృశ్యం అయ్యాడు.

విచారణ ఇంకా కొనసాగుతోంది:

తర్వాత చెన్నైలో రాయుడు డెడ్ బాడీ వెలుగు చూసింది. ఈ కేసులో అనుమానితులుగా 5 మంది నిందితులను అదుపులో తీసుకున్న పోలీసులు చెన్నై మింట్ పరిధిలోని సెవెల్ హిల్స్ పీఎస్‌కు తరలించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్‌చార్జ్ వినూత, ఆమె భర్త చంద్రబాబు ఉన్నారు. ఈనెల 8న చెన్నైలోని కూవంనది ఫోర్త్ క్రాస్‌లోని ఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డు వెనుక రాయుడు డెడ్‌బాడీని పడేసిన నిందితులను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. హత్య జరిగినట్లు భావించారు. నిందితుల్లో శ్రీకాళహస్తికి చెందిన శివకుమార్, గోపి, దాసర్‌లు కూడా ఉన్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు నిందితులను శ్రీకాళహస్తి తీసుకొచ్చి విచారిస్తున్నారు.

జనసేన హైకమాండ్ చర్యలు:

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ వినూత కోటపై వేటు పడింది. జనసేన పార్టీ నుంచి బహిష్కరిస్తూ అధిష్టానం లేఖ విడుదల చేసింది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా, పార్టీ విధివిధానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్టు లేఖలో పేర్కొన్న జనసేన అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చెన్నైలో జరిగిన హత్య కేసు వినూతపై నమోదు కావడంతో హై కమాండ్ చర్యలు చేపట్టింది .

చెన్నైలో చోటుచేసుకున్న యువకుడి హత్య కేసులో అరెస్ట్ అయిన జనసేన నేతలు ఎవరు?

జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కోట వినుత మరియు ఆమె భర్త చంద్రబాబు ఈ హత్య కేసులో తమిళనాడు పోలీసులచే అరెస్ట్ చేయబడ్డారు.

హత్యకు గురైన యువకుడి వివరాలు ఏమిటి?

హత్యకు గురైన యువకుడు శ్రీకాళహస్తి మండలం బక్కిసంపాలెంకు చెందిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు. అతడు గతంలో వినుత దంపతుల వద్ద డ్రైవర్‌గా పనిచేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Rajiv Kumar Meena: కానిస్టేబుల్ రాత పరీక్షా ఫలితాలు విడుదల

AndhraPolitics Breaking News Janasena latest news murdercase Srikalahasti Telugu News VinuthArrest

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.