📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telugu news: Srikalahasti: పెరిగిన శివయ్య హుండీ రాబడి

Author Icon By Tejaswini Y
Updated: December 6, 2025 • 10:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Srikalahasti : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో అమలు చేస్తున్న పలు సంస్కరణలు సత్ఫలి తాలు ఇస్తున్నాయని ఆలయ ఇఓ డి.బాఎ రెడ్డి(EO D.Bae Reddy) అన్నారు. శుక్రవారం శ్రీకాళహస్తీశ్వరా లయంలో వెలసిన స్వామి అమ్మవార్లతో పాటు పరివార దేవతల ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. రోజుల్లో హుండీల్లో రూ.1కోటి 41లోల 30వేల 77 లు వచ్చినట్లు వివరించారు.

Read Also: Tirumala: నేడు వైకుంఠద్వార దర్శన టికెట్లు విడుదల

తాను ఇఓగా బాధ్యతలు చేపట్టిన తరువాత స్థానిక శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుధీర్రెడ్డి సూచనలతో ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఆలయంలో దళారుల బెడదకు చెక్ పెట్టా మన్నారు. ఆలయంలో చేపట్టిన సంస్కరణల్లో రాబోవు రోజుల్లో ఆన్లైన్ అమలు చేస్తున్నట్లు వివరించారు. తాము ఇక్కడ చేపట్టిన సంస్కరణలతో ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సర్వేల్లో భక్తులు సదుపా యాలకు సంబంధించి 72 శాతం సాధించి రాష్ట్రంలో (Srikalahasti)శ్రీకాళ హస్తీశ్వరాలయానికి మంచి పేరు వచ్చిందన్నారు.

రాహుకేతుదోష నివారణ పూజల టిక్కెట్లు

Rahu Ketu

శ్రీకాళ హస్తీశ్వరాలయం(Srikalahasteeswara temple)లో చేపట్టిన పలు సంస్కరణలకు సంబంధించి వివరిస్తూ రాబోవు రోజుల్లో ఆలయ ప్రకారం లోపల ఎలాంటి కౌంటర్లు ఉండవని ఒకే చోట సేవా టిక్కెట్లుతో పాటు రాహుకేతుదోష నివారణ పూజల టిక్కెట్లు జారి చేయటానికి 8కౌంటర్లు రెండవ గోపురం వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కాగా అభిషేకాలు, హోమాలకు సంబంధించిన టిక్కెట్లును ఆన్లైన్ ద్వారా ఏర్పాటు చేసామని ఇఓ బాపిరెడ్డి వివరించారు.

హుండీల ఆలయాలు పెరుగుదలతో పాటు రాహుకేతు దోష నివారణ పూజలకు ఉపయోగించే వెండి నాగపడగల రూపంలో 375కిలోల ఆదా 800 గ్రాములు, బంగారు 034 గ్రాములు వచ్చిందన్నారు. అమెరికా డాలర్లు 19, మలేషియా కరెన్సీ 13, వెరసి 108 నెంబర్లు వచ్చాయని తెలిపారు. హుండీల లెక్కింపులో డిప్యూటి ఇఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టె సాయిప్రసాద్, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

EO Bapi Reddy Hundi collections Srikalahasteeswara Temple Srikalahasti Temple offerings Tirupati district

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.