📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Srikalahasti: కమనీయం గౌరీ శంకరుల కల్యాణం

Author Icon By Saritha
Updated: February 19, 2026 • 12:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Srikalahasti: మహాశివరాత్రి (Mahashivratri) అంటే శ్రీకాళహస్తిలో పండగ వాతావరణమే. ప్రతి ఒక్కరు తమ ఇంటిలో ఉత్సవంలా నిర్వహించటం ఆనవాయితి. ఈ ఏడాది శాసనసభ్యుడు బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి ఆలయ ఇఓ బాపి రెడ్డి గతంలో కన్నా భిన్నంగా నిర్వహించాలని భావించారు. అందుకు చర్యలు తీసుకున్నారు. ప్రణాళికలు రచించుకున్నారు. విజయం సాధించారు. శ్రీకాళహస్తిలో వెలసిన గౌరీ శంకరుల కళ్యాణోత్సవం సంప్రదాయబద్ధంగా బుధవారం వేకువజామున జరిగింది. వేలాది మంది భక్త జనులు విఐపిలు వీక్షిస్తుండగా దేవదేవుని కళ్యాణం కన్నుల వండువగా సాగింది.

Read Also: Andhra Pradesh: మహాశివరాత్రి ముగింపు ఉత్సవాలు

Srikalahasti: The wedding of Kamaniyam Gauri Shankar

సంప్రదాయ శాస్త్రోక్తంగా మాంగల్యధారణ

వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రాధానార్చకుల మంత్రాలతో భోళాశంకరుని మాంగల్యధారణ శాస్త్రోక్తంగా భావి తరాలకు హిందూ సంప్రదాయంలో వివాహానికి గల ప్రాధాన్యతను తెలియజేస్తూ కార్యక్రమాలను నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్స వాల్లో స్వామి కళ్యాణానికి అమ్మవార్ల ఎంతోప్రాముఖ్యత ఉంది. ఈ కళ్యాణంతో పాటు అనాదిగా నిరుపేదలు, మొక్కులు కల్గిన వారు ప్రేమజంటలు రెండవ పెళ్ళి చేసుకోవాలనుకునే వారు పాల్గొని స్వామి అమ్మవార్ల మాంగల్యధారణ సందర్బంగా వివాహాం చేసుకోవటంఆనవాయితి. ఈ అనవాయితి ఈ ఏడాది కూడా సాగింది.

నిబంధనల నడుమ వివాహాల నిర్వహణ

అయితే కొంత కాలం దొంగపెళ్ళిళ్ళు విచ్చల విడిగా జరుగుతున్నాయని గగ్గోలు పుట్టింది. తరువాత బాల్యవివాహాలకు సంబంధించి రభస చెలరేగటంతో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్స వానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. బుధవారం వేకువజామున జరిగిన కళ్యాణోత్సవంలో బాల్యవివాహాలు లేవనే చెప్పాలి. వివాహాలు చేసుకున్న వారంతా రెవెన్యూశాఖ అధికారుల వద్ద ధృవీకరణ పత్రాలు తెచ్చుకున్నారు. దాంతో సమస్య కనబడలేదు. కైలాన నాదుని కళ్యాణోత్స వం అంటే శ్రీకాళహస్తి చుట్టుపక్కల జనానికి ఎంతో సంబరం తమ ఇంటిలో వివాహా సంబరం ఉన్నట్లు భావి స్తారు. చుట్టుపక్కల గ్రామా ల నుంచి తండోపతండాలుగా భక్త జనం కళ్యాణోత్సవం రాత్రి కదలి వచ్చారు. దాంతో పట్టణంలో ఎటు చూసినా భక్తజనుల సందడికనబడింది. స్వామి అమ్మవార్ల కళ్యాణం చూడటానికి భక్తులు సంబరపడు తుంటారు.

శ్రీకాళహస్తీశ్వరాలయంలోని అలంకార మండపంలో శ్రీకాళహస్తీశ్వరుడుగా వెలసిన కైలాసనాధుని వధువుగా ముస్తాబు చేసారు. దేవేరి జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారిని వధువుగా కన్నుల మిరుమిట్లుగోల్పునట్లు, ఇట్టె ఆకట్టుకునే శోభాయమానంగా ముస్తాబు చేసారు. పట్టణంలోని తేరువీదిలో గల వాహనాల మండపం వద్ద స్వామి వారిని అంబారి వాహ నంపై, అమ్మవారిని సింహవాహనంపై ప్రతిష్టించారు.

వైభవంగా గ్రామోత్సవం కళ్యాణ వేదిక

మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. మొదట పూజల్ని ఆలయ కార్యనిర్వహణాధికారి డి. బాపి రెడ్డి దంపతులు, ధర్మకర్తల మండలి చైర్మెన్ కొట్టె సాయి ప్రసాద్ దంపతులు, రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ దంపతులు మొదటి పూజలు అందించి శ్రీకారం చుట్టారు. ముందు స్వామి వారిని పట్టణంలోని నెహ్రూవీధి వద్దకు చేర్చి తరువాత అమ్మవారి పురప్రదర్శన ప్రారంభమయింది. ముందు మేళ తాళాలు, మంగళవాయిద్యాలు కోలాటాలు గెరిగెనృత్యాలు, పంచవాయిద్యాలు, బుట్టబొమ్మల నాట్యాలు, మయూరాల ఆటలు, కీలుగుర్రాల, లంబాడ నృత్యాలు ఒక్కటేమిటే ప్రతి ఒక్కటీ ప్రత్యేకంగా కళ్యాణ మండపం వద్దకు సాగించారు.

వేద పండితులు వేద మంత్రాలను పఠిస్తుండగా, అంబారి వాహనంపై ఆశీనుడైప వరుడు శ్రీకాళ హస్తీశ్వరుడు, సింహవాహనంపై ఆశీనురాలైప వదువు జ్ఞాన ప్రసూనాంబ దేవిల ముస్తాబు చూడటానికి వేయి కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదేమో. నాటి రాజులు అందించిన ఏడు వారాల నగలతో అలంకార గురుకుల్ రాజేష్ స్వామి అమ్మవార్లను ముస్తాబు చేయగా రాజసంగా కళ్యాణ వేదిక వద్దకు చేరుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Bojjala Venkata Sudhir Reddy Gauri Shankara Kalyanam Latest News in Telugu Maha Shivaratri Srikalahasteeswara Temple Srikalahasti Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.