శ్రీకాళహస్తి: తిరుపతిజిల్లా శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో దసరా మహోత్సవాలకు ముస్తాబౌతుంది. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు ఓ వైపు దేవస్థానం మరో వైపు ప్రైవేటు వ్యక్తులు వివిధ దేవి దేవాలయాల్లో నిర్వహణకు సిద్ధం చేస్తున్నారు. పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించటం ఆనవాయితి. ఈ నేపధ్యంలో శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్థానిక శాసనసభ్యుడు బొజ్జల వెంకటసుధీర్రెడ్డి గోడపత్రికలను ఆవిష్కరించారు. ఆర్యవైశ్య సంఘం పట్టణం, బహాదూరుపేటల్లో పాలకమండలి సమావేశాలు నిర్వహించారు.
ఎన్నడూ లేని విధంగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు
ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాల(Navratri celebrations)ను నిర్వహించాలని తీర్మానించారు. దేవస్థానం సారధ్యంలో ఆలయంలో వెలసిన జాన ప్రసూనాంబ అమ్మవారి ఆలయంలోనూ, ఎదురుగా బొమ్మల కొలువు ఏర్పాటు చేయం ఆనవాయితి. అలాగే బాల జ్ఞానాంబ ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక మహిళా భక్తుల భాగస్వామ్యంతో కనకాచలం(Kanakachalam)పై వెలసిన దుర్గమ్మ ఆలయంలో భారీ ఎత్తున నిర్వహించటం ఆనవాయితి. ఇక్కడ అమ్మవారికి పూజలు అభిషేకాలతో పాటు పొంగళ్ళు పెట్టే సంప్రదాయం అమలులో ఉంది. అలాగే ఆలయానికి అనుబంధంగా ఉన్న ముత్యాలమ్మ ఆలయంలో భారీ ఎత్తున అలంకారాలు, పూజలు నిర్వహిస్తారు. ఇందుకు ఆలయాన్ని శనివారం నుంచే ఏర్పాట్లు చేపట్టారు. కాగా పట్టణ నడిబొడ్డులోని కొత్తపేట శీతలాంబ ఆలయం వద్ద పది రోజుల పాటు రాష్ట్ర స్థాయి కళాకారులను ఆహ్వానించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుంది. ఈ మేరకు ఇక్కడ భారీ ఎత్తున సెట్టింగ్లు ఏర్పాటు చేసారు. ఇక పట్టణానికి దక్షిణాన వెలసిన దక్షిణ కాళి మాత ఆలయంలో పూజలతో పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందుకు దక్షిణ కాళి మాత ఆలయం ముస్తాబౌతుంది. పుణ్యక్షేత్రంలో వినాయక చవితి ఉత్సవాలను 12రోజులు నిర్వహిస్తే దసరా మహోత్సవాలను 9 రోజుల పాటు నిర్వహిస్తారు. ఎటు చూసినా చక్కటి చలువ పందిళ్ళతో ముస్తాబు చేసారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: