శ్రీకాళహస్తి : రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడుకు(CM Chandrababu) బుధవారం శ్రీకాళహస్తీశ్వరుని తీర్థ ప్రసాదాలను, వేదపండితులచే ప్రత్యేకాశీర్వచనాలు అందించారు. అంతేకాక శ్రీకాళ హస్తీశ్వరుని (Srikalahasti) చిత్రపటాలను అందించారు. ఈ సందర్భంగా ఆలయానికి సంబంధించిన అభివృద్ధి చిత్రాలను స్థానిక శాసనసభ్యుడు బొజ్జల వెంకటసుధీర్రెరెడ్డి లాప్టాప్లో సిఎంకు చూపారు.
కాగా ఈ నెల 10 నుంచి 23 వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించాలని అభ్యర్థించారు. లోకకళ్యాణం నిమిత్తం జరుగు బ్రహ్మోత్స వాల్లో ముఖ్యఅతిధిగా పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని కూడా కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళిన ప్రజాప్రతినిధులు అధికారులనుద్దేశించి మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలోని ఆలయాల్లో పరిపాలనా పారిశుద్ధ్యంకు సంబంధించి నిర్వహించిన సర్వేల్లో శ్రీకాళహస్తికి మొదట గ్రేడ్ వచ్చింది.
Read Also: Sonu Sood: ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్.. స్పందించిన నటుడు

సదుపాయాలు కల్పించాలని సిఎం సూచన
కీపిటి అంటూ అభినందించినట్లు తెలిసింది. ఈ పేరు రావటానికి పాలకులు, అధికారుల కృషిని సిఎం అభినందించారు. (Srikalahasti) శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలకు దేశ నలుమూలల నుంచి జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో హాజరవుతారు. ఏర్పాట్లు జాగ్రత్త చేయండి, వచ్చిన ప్రతిభక్తుడు సంతృప్తిగా వెళ్ళాలి. వారికి సకల సదుపాయాలు కల్పించాలని సిఎం సూచించారు. అంతేకాక వచ్చిన ప్రతి ఒక్కరు మళ్ళీ మళ్ళీ రావాలనే విధంగా భక్తుల పట్ల ప్రవర్తించాలన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని వేదపండితులు శివకుమార్, త్రినాధ్ శర్మలు ఆశీర్వదించారు. ఎమ్మెల్యేతో పాటు ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టెసాయి ప్రసాద్, ధర్మకర్తల మండలి సభ్యులు పగడాల మురళి, గోపినాథ్, నాగరాజు, దండి రాఘవయ్య, ఆలయ కార్యనిర్వహ ణాధికారి డి. బాపిరెడ్డి, డిప్యూటీ ఇఓ కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు.
మంత్రులకు ఆహ్వానం
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర మంత్రులకు శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టెసాయి ప్రసాద్లు కలసి ఆహ్వాన పత్రికలు అందించి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో దేవాదాయశాఖ కమిషనర్ డాక్టర్ హరి జవహర్లాల్, దేవాదాయశాఖ మంత్రి రామనారా యణరెడ్డి, రోడ్డు భవనాల శాఖ మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత, జిల్లా ఇన్చార్జి మంత్రి, రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, తిరుపతి శాసనసభ్యుడు ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవులు, రాష్ట్ర సోషల్ వెల్ఫెర్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, బిసి వెల్ఫెర్ మంత్రి సవిత, రాష్ట్ర శిశుసంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, రాష్ట్ర మైక్రో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను స్వాగతం పలుకుతూ ఆహ్వాన పత్రికలను అందించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: