Srikakulam Stampede:దుర్ఘటనపై మోదీ సంతాపం – మృతుల కుటుంబాలకు పరిహారం

Read Time:  1 min
Srikakulam Stampede
Srikakulam Stampede
FONT SIZE
GET APP

శ్రీకాకుళం జిల్లా(Srikakulam Stampede) కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. ఈ ఘటనలో 10 మంది భక్తులు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఆలయంలో ఏకాదశి సందర్భంగా భక్తుల భారీ రద్దీ నెలకొనడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. దీనిలో కొందరు స్పృహ తప్పి పడిపోవడంతో పరిస్థితి అదుపుతప్పి ప్రాణనష్టం సంభవించింది.

Read Also: Srikakulam Stampede: తొక్కిసలాట ఘటన పై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత

Srikakulam Stampede
Srikakulam Stampede

ఈ ఘటనపై(Srikakulam Stampede) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని కార్యాలయం (PMO) ప్రకటనలో భాగంగా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ప్రకటించింది.

ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాల పట్ల సానుభూతి తెలిపిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహాయాన్ని అందించేందుకు సూచనలు జారీ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మరణించిన వారిలో ఎక్కువమంది మహిళా భక్తులేనని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.