📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Srikakulam Stampede:  శ్రీకాకుళం తొక్కిసలాటకు ఆలయ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమా?

Author Icon By Sushmitha
Updated: November 1, 2025 • 5:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడులో నటుడు విజయ్(Vijay) ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన మరువకముందే ఆంధ్రప్రదేశ్లో మరో తొక్కిసలాట విషాద ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిదిమంది మరణించిన విషయం తెలిసిందే. కాశీబుగ్గలోని

వెంకటేశ్వర స్వామి ఆలయం ముందుగా లోపలకి ప్రవేశించే ముందు గేట్ల వద్ద భారీగా భక్తులు చేరుకున్నారు. ఈ క్రమంలోనే గేట్ తెరవగానే మెట్లపై గందరగోళం జరిగింది. దీంతో మెట్లపై ఉన్న భక్తులు ఒకరిపై ఒకరు తోసుకుని కిందపడిపోయారు. అదే సమయంలో కిందపడిపోయిన వారిని తొక్కుకుంటూ ప్రజలు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో తొమ్మిదిమంది భక్తులు మరణించారు.

Read Also: Hyderabad Metro: మెట్రో రైళ్ల టైమింగ్స్ మార్పు

గుడి యాజమాన్యం తప్పిదమే ప్రమాదానికి కారణమా?

గుడి యాజమాన్యం చేసిన ఒక చిన్న తప్పిదం వల్లే ఈ ఘోరమైన ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కనీసం పోలీసులకు ఒక చిన్న సమాచారం సైతం ఇవ్వలేదు. అంతేకాక ఆలయానికి భారీ ఎత్తున భక్తులను అనుమతి ఇవ్వడమే ఆయల యాజమాన్యం చేసిన పెద్ద తప్పుగా తెలుస్తోంది. కార్తీక మాసంలో అది కూడా ఏకాదశి రోజు ఆలయాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని తెలిసి కూడా ఆలయ యాజమాన్యం పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

 అంతేకాక వారి నుంచి అనుమతి కూడా తీసుకోలేదు. పోలీసుల భద్రత కొరవడడంతోనే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తున్నది. ఈ ఘటనలో పలువురు భక్తులు కూడా గాయపడ్డారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

దేశంలో ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా పాలకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే అమాయకుల పాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇక్కడ ఆలయ యాజమాన్యం తప్పిదం స్పష్టంగా కనిపిస్తున్నది. పెద్ద సంఖ్య ప్రజలు వస్తున్నప్పుడు ముందస్తు అంచనాలు వేయడంలో విఫలం కావడమే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరిగేందుకు కారణం అవుతున్నది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh tragedy crowd control failure Google News in Telugu Latest News in Telugu Negligence allegations Safety concerns Srikakulam stampede Telugu News Today temple management

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.