📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Srikakulam Stampede: తొక్కిసలాట ఘటన పై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత

Author Icon By Pooja
Updated: November 1, 2025 • 3:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీకాకుళం జిల్లా(Srikakulam Stampede) కాశీబుగ్గలో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్థానిక శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీతో పాటు ఇతర ఉన్నతాధికారులను సంప్రదించి, సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆమె ఆదేశించారు.

Read Also: Srikakulam Stampede: తొక్కిసలాట ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు

Srikakulam Stampede

హోంమంత్రి మాట్లాడుతూ, “కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో(Srikakulam Stampede) పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన వార్త తీవ్రంగా కలిచివేసింది. అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రభుత్వం వారిని అన్ని విధాలా ఆదుకుంటుంది,” అని తెలిపారు.

ప్రమాదం ఎలా జరిగింది?

హోంమంత్రి అనిత(Home Minister Anita) వివరాల ప్రకారం, ఈ ఆలయం మొదటి అంతస్తులో ఉండటంతో భక్తులు సుమారు 20 మెట్లు ఎక్కి పైకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మెట్ల రెయిలింగ్ ఒక్కసారిగా విరిగిపోవడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయి తొక్కిసలాట జరిగింది. సాధారణంగా ఈ ఆలయానికి ప్రతి వారం 1,500 నుండి 2,000 మంది భక్తులు వస్తారని తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నారని ఆమె దుఃఖం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని హోంమంత్రి ఆదేశించారు. గాయపడిన భక్తుల పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ దుర్ఘటనతో కాశీబుగ్గ ప్రాంతంలో విషాదం అలుముకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

KashibuggaTemple Latest News in Telugu SrikakulamTragedy Stampede Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.