- ఉత్సవాల నిర్వహణలో లోటుపాట్లు ఉండకూడదు -దేవాదాయ శాఖ కమిషనర్ భానుచంద్ర
శ్రీకాకుళం : అరసవల్లి రథసప్తమి ఉత్సవాల్లో స్వామివారి దర్శనం కోసం సామాన్య భక్తులకు అగ్ర తాంబూలం ఇస్తున్నామని గర్భగుడి ఎదుట నాలుగు వరుసల్లో దర్శనం కల్పించడం ద్వారా భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన రథసప్తమి ఉత్సవాల నిర్వహణపై డీఎస్పీ వివేకానందతో కలసి ఏర్పాట్లు స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆలయ ఆర్చకులు వేదమంత్రాలతో కమిషనర్ కు స్వాగతం. పలికారు. స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ వేడుకల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని, ప్రతి సెక్టార్లో కీలక శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Read also: AP Politics: తిరుపతి జిల్లాలో వైసీపీ నేతలపై కేసు నమోదు
Ratha Saptami in Arasavalli.
రథసప్తమి ఉత్సవాలకు విస్తృత సన్నాహాలు
దర్శన ఏర్పాట్లపై ప్రత్యేక దిశానిర్దేశం చేస్తూ ప్రముఖుల (వీఐపీ) రాక వల్ల సామాన్య భక్తుల క్యూ లైన్లకు ఎక్కడా అంతరాయం కలగకుండా ప్రత్యేక మార్గాలను ఏర్పాట్లు చేయాలని ఇది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. దాతల పాస్లు ఉన్నవారికి నేరుగా ప్రవేశం ఉంటుందన్నారు. భక్తులకు ఆహారం పంపిణీ చేసే దాతల కోసం (ఫుడ్ డోనర్స్) ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని తెలిపారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు తాగునీరు పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి కనీస సౌకర్యాల విషయంలో రాజీ పడకూడదని దేవాదాయ శాఖ తరపున 70 ట్యాంకులు మరియు 30 వేల వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు 300 రూపాయలు 100 రూపాయల టికెట్లను రేపటి నుండి ఆన్లైన్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు.
కనీస సౌకర్యాలపై రాజీ లేదు : దేవాదాయ శాఖ
క్షీరాభిషేకం టికెట్స్ ఆన్లైన్ ద్వారా 24వ తేదీ నుండి బుక్ చేసుకోవాలని భక్తులకు విజప్తి చేశారు. ఈ విధానం ద్వారా భక్తులకు సమయం కలిసి వస్తోందని అన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టిక్కెట్ పైనే దర్శన సమయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. రథసప్తమి ఏర్పాట్లలో భాగంగా దేవాదాయ శాఖ నుండి 100 మంది సిబ్బంది, 500 మంది వాలంటీర్లు పాల్గొంటారని తెలిపారు. క్యూ లైన్ల వద్ద భక్తులకు ఎండ తగలకుండా షేడ్ నెట్లు, చల్లని మజ్జిగ పంపిణీకి ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ పర్యవేక్షణలో డీఎస్పీ వివేకానంద, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివరామప్రసాద్ (హరి), ప్రత్యేక అధికారి శోభారాణి, సింహాచలం దేవస్థానం సూపరిండెంట్ కంచమూర్తి, దేవస్థానం ఈ.వో. ప్రసాదరావు, అరసవల్లి ఆలయ సిబ్బంది, వివిధ స్థాయిల అధికారులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: