Srikakulam Crime: శ్రీకాకుళం జిల్లా టిడిపి కార్యాలయ ఉద్యోగి మృతి, చిన్న వివాదం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పరిచయమే లేని ఇద్దరు యువకుల మధ్య అనవసరంగా మొదలైన గొడవ తోపులాటకు దారితీసి ఒకరి మరణానికి కారణమైంది. ఉగాది రోజు అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో శ్రీకాకుళం నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తోన్న మండల వీధికి చెందిన గొర్లె మోహనరావు (26) అనే యువకుడు మృతి చెందాడు.
మోహనరావు గురువారం నరసన్న పేటలో జరిగిన పార్టీ సమావేశానికి వెళ్లి రాత్రి పొద్దు పోయాక తిరిగి వచ్చాడు. ఇంటికి వెళ్లే క్రమంలో ఉమెన్స్ కళాశాల ఎదురుగా మండల వీధికి వెళ్లే రోడ్డులో తన మేనల్లుడు హరీష్ మహాలక్ష్మీనగర్ కాలనీకి చెందిన కొందరు యువకులతో కలిసి ఉండటాన్ని గమనించి వారి వద్దకు వెళ్లాడు. మేనల్లుడిని పిలిచి అంత రాత్రి వరకు మహాలక్ష్మీనగర్ యువకులతో ఎందుకు ఉన్నావంటూ మందలించినట్లు పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం తెలుస్తోంది.
Read Also : TDP : టీడీపీలో విషాదం.. సీనియర్ నేత కన్నుమూత
Srikakulam Crime: తోపులాటలో ప్రాణం పోయింది.
మోహన రావు మందలింపులను విన్న గుంపులోని గడ్డి మనోహర్ అలియాస్ మనోజ్ అనే యువకుడు కల్పించుకుని మహాలక్ష్మినగర్ యువకులను ఎందుకు నిందిస్తున్నావంటూ నిలదీశాడు. దాంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు దారి తీసింది. ఆ క్రమంలో బైక్ మీద ఉన్న మోహనరావును మనోజ్ బలంగా నెట్టడంతో కింద వడిపోయిన బాధితుడు తలకు బలమైన గాయమైంది. తెలుసుకుని అక్కడికి చేరుకున్న మోహనరావు కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే రిమ్స్ ఆసుపత్రి కి తరలించి చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది.
మనోజ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మోహనరావు మరణించినట్లు ప్రకటించారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం సంఘటన స్థలంలో యువకుల సమూహం ఉండగా పోలీసులు మాత్రం తోపులాట జరిగినప్పుడు మోహనరావు, మనోజ్ ఇద్దరే ఉన్నారని చెబుతున్నారు. మోహన్ మృతిని వైద్యులు ధ్రువీకరించడంతో ఒకటో పట్టణ పోలీసులు నిందితుడు మనోజ్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. తలకు బలమైన గాయం కావడం వల్లే మోహనరావు మృతి చెందినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. రాత్రి 10.30 నుంచి 12.30 మధ్యలో జరిగిన ఈ ఘటన ఊహించని విధంగా జరిగిందని పోలీసులు చెబుతున్నారు. వివాదం ఎందుకు తలెత్తిందన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :