📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Sri SathyaSai Baba Jayanthi: వేడుకల కోసం పుట్టపర్తికి 200 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

Author Icon By Pooja
Updated: November 5, 2025 • 11:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీ సత్యసాయిబాబా శతజయంతి(Sri SathyaSai Baba Jayanthi) ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని, భక్తులకు సౌకర్యంగా ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా 200 ప్రత్యేక బస్సులను పుట్టపర్తి వైపు నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు.

Read Also: Kartika Purnima: కార్తీక పౌర్ణమి – దీపం ఏ సమయంలో పెట్టాలి?

Sri SathyaSai Baba Jayanthi

ఇటీవల ఆయన శ్రీ సత్యసాయి(Sri SathyaSai Baba Jayanthi) జిల్లా పుట్టపర్తిని సందర్శించి, జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్టు(Central Trust)) ప్రతినిధులతో సమావేశమై రవాణా సదుపాయాలపై చర్చించారు. శతజయంతి వేడుకలకు దేశ, విదేశాల నుంచి వేలాది భక్తులు రానున్న నేపథ్యంలో, ఎలాంటి రవాణా సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

తరువాత స్థానిక ఆర్టీసీ డిపో, బస్టాండ్‌లను అధికారులతో కలిసి పరిశీలించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా సౌకర్యవంతమైన ప్రయాణం అందించడమే తమ లక్ష్యమని ద్వారకా తిరుమలరావు తెలిపారు. అవసరమైతే అదనపు సర్వీసులను కూడా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు.

ఇక శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు నవంబర్ 23న పుట్టపర్తిలో ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా ప్రకటించింది. ఉత్సవాల్లో సుమారు 185 దేశాలకు చెందిన భక్తులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరుకానున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Latest News in Telugu PutaparthiCelebrations SaiBabaJayanthi SriSathyaSaiBabaCentenary Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.