M. Sri Bharat గీతం భూముల వివాదంపై వైసీపీ అధినేత Y. S. Jagan Mohan Reddy చేసిన ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. వాస్తవాలను వక్రీకరించి గీతం సంస్థపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భూముల విలువను రూ.5,000 కోట్లు అంటూ చెప్పడం పూర్తిగా తప్పని, లెక్కల ప్రకారం మొత్తం విలువ సుమారు రూ.1,000 కోట్లే అవుతుందని వివరించారు.
రుషికొండ సమీపంలోని 54.79 ఎకరాల భూమిని చదరపు గజానికి రూ.60–65 వేల రేటుతో లెక్కిస్తే, ఎకరా విలువ సుమారు రూ.19–20 కోట్లకే పరిమితమవుతుందని చెప్పారు. ఈ లెక్కన మొత్తం భూమి విలువ రూ.1,000 కోట్లకు మించదన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం గతంలో ఒక అంతర్జాతీయ స్కూల్‌కు ఎకరా రూ.1 కోటికి భూమి కేటాయించిందని గుర్తు చేశారు.
Read Also: Australia: ఆసీస్ కెప్టెన్‌గా సోఫీ మోలినెక్స్ నియామకం
గీతం భూమిని ఉచితంగా అడగడం లేదని, ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. కరోనా సమయంలో గీతం ఆసుపత్రి వేలాది మందికి సేవలందించిందని, అలాంటి విద్యాసంస్థలపై రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు మానుకోవాలని జగన్‌కు సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: