SPMVV Tirupati: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (ఎస్‌పిఎంవివి) సంగీత, నృత్య, ఫైన్ ఆర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ప్రదర్శించిన “అమ్మ చెక్కిన బొమ్మ” నాటకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. పీఎం-ఉషా పథకం కింద నిర్వహించిన ఈ కార్యక్రమం సామాజిక సమస్యలపై చర్చను రేకెత్తించడమే కాకుండా, కళాత్మక విలువలతో అలరించింది.
Read Also: CM Chandrababu Visit Cheepurupalli: రేపు చీపురుపల్లికి సీఎం చంద్రబాబు
వివక్షపై గళం.. గౌరవం కోసం పోరాటం
జ్యోతిరాజ్ బీసెట్టి రచనలో, వెంకట్ గోవాడ దర్శకత్వంలో రూపొందిన ఈ నాటకం.. సమాజంలో భిన్న లింగ గుర్తింపులు కలిగిన వ్యక్తులు (Transgender/Third Gender) ఎదుర్కొనే అవమానాలు, వివక్షను కళ్లకు కట్టింది. వారు స్వీయ గుర్తింపు మరియు గౌరవం కోసం చేసే పోరాటాన్ని, వారి మనోవేదనను హృదయానికి హత్తుకునేలా చిత్రించారు. సమాజంలో బలంగా నాటుకుపోయిన మూస ధోరణులను ఈ నాటకం ప్రశ్నిస్తూ, సహానుభూతి అవసరాన్ని నొక్కి చెప్పింది.
SPMVV Tirupati: మానవీయ స్పందనలకు వేదిక
ఈ సందర్భంగా వర్సిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. పాఠ్యపుస్తకాలు అందించలేని భావోద్వేగ అనుభూతిని నాటక ప్రదర్శనలు అందించగలవని పేర్కొన్నారు. అన్యాయంపై ప్రశ్నించే పాత్రలు, మౌనాన్ని ఛేదించే సంభాషణలు ప్రేక్షకులను కేవలం వీక్షకులుగా కాకుండా, ఆ అనుభవంలో భాగస్వాములను చేశాయని తెలిపారు. విద్యాసంస్థల్లో ఇటువంటి ప్రదర్శనలు విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనను, సామాజిక అవగాహనను పెంపొందిస్తాయని వివరించారు.
అధికారుల పర్యవేక్షణ
ఉపకులపతి ప్రొఫెసర్ వి. ఉమ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్. ఉషా, సామాజిక శాస్త్రాల డీన్ ప్రొఫెసర్ సి. వాణి, సంగీత విభాగం హెడ్ ఆర్.ఎన్.ఎస్. శైలేశ్వరి, డా. యు. హిమబిందు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: