📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

Latest Telugu News: Cards Play: స్పీకర్ Vs డిప్యూటీ సీఎం మధ్య మాటల యుద్ధం

Author Icon By Vanipushpa
Updated: October 22, 2025 • 3:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి జిల్లాల్లో పేకాట కల్చర్ పెరిగిపోయిందని భీమవరం డీఎస్పీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pavan Kalyan) సీరియస్ అయిన అంశంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు(Raghuramakirishamraju) స్పందించారు. గోదావరి జిల్లాలో పేకాట ఆడటం సహజమని ఆయన అన్నారు. అయినా కూటమి ప్రభుత్వం పేకటపై ఉక్కుపాదం మోపిందని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. భీమవరం డీఎస్పీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ సీరియస్ అవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. భీమవరం డీఎస్పీ జయసూర్య మంచి అధికారి అని రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు. ఎవరో పవన్ కళ్యాణ్‌కు ఆయన గురించి చెడుగా చెప్పారని డిప్యూటీ స్పీకర్ RRR అన్నారు.

Read Also: Prawns: ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌

Cards Play

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆగ్రహం

ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భీమవరం పరిధిలో జూద శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్‌ వివాదాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని డీఎస్పీపై ఆరోపణలు ఉన్నాయి. కూటమి నేతల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీతో పవన్‌ మాట్లాడారు. జయసూర్య వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి, డీజీపీకి తెలియజేయాలని తన కార్యాలయ అధికారులకు పవన్‌ సూచించారు. ఈ విషయంపై డిప్యూటీ స్పీకర్ స్పందించారు.

జనసేన పార్టీ గుర్తు ఏమిటి?

ఆ పార్టీ ఎన్నికల చిహ్నం గాజు గ్లాసు.

రఘురామ కృష్ణంరాజు ఎవరు?

కనుమూరు రఘురామకృష్ణ రాజు (జననం: 1962 మే 14) భారతీయ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుండి 17 వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యుడిగా (ఎంపి) పనిచేస్తున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

Government Dispute Latest News Breaking News Legislative Assembly Political Clash power struggle Speaker vs Deputy CM State Politics Telugu News Verbal Spat

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.