ఇంధన పరిరక్షణ(Fuel conservation) ఆవశ్యకత అంశంపై ఎస్ పిడిసిఎల్(SPDCPL) పరిధిలోని తొమ్మిదిజిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల 9,10 తరగతుల విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్ పిడిసిఎల్ సిఎండి శివశంకర్ తోటి తెలిపారు. శుక్రవారం ఆయన ఇంధన పరిరక్షణ ఆవశ్యకతపై కొన్ని వివరాలు తెలిపారు. సంస్థ పరిధిలోని తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 9,10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఈ పోటీల్లో పాల్గొనాలన్నారు.
Read also: రవికి పోలీసు శాఖలో ఉద్యోగం? క్లారిటీ ఇచ్చిన డిసిపి
స్టాల్స్, హోర్డింగ్లు, పాఠశాల స్థాయి పోటీలు
ఈ వారోత్సవాల్లో భాగంగా ఈనెల 14వతేదీ ఇంధన పరిరక్షణ(Fuel conservation) అంశంపై వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద హోర్డింగ్లు ఏర్పాటు, కరపత్రాల పంపిణీ, 14, 15 తేదీల్లో తిరుపతిలో సైన్స్ ఎగ్జిబిషన్లో స్టాల్స్ ఏర్పాటు జరుగుతుందన్నారు. 16వతేదీ పాఠశాలల్లో విద్యార్థులకు క్విజ్, వక్తృత్వపోటీలు ఉంటాయన్నారు. 17వతేదీ ఆధునికసాంకేతికతతో స్మార్ట్ వీధిదీపాల నిర్వహణ, నీటిసరఫరా వ్యవస్థ అంశాలపై అవగాహన కల్పించేదుకు కళాశాలల విద్యార్థులకు సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థులకు భారీ అవకాశం
వారోత్సవాల సందర్భంగా తొలుత సంస్థ పరిధిలోని 9 జిల్లాల్లో డివిజనల్, సర్కిల్ స్థాయిల్లో నిర్వహించే క్విజ్, వక్తృత్వపు పోటీల్లో పాల్గోని గెలుపొందిన విద్యార్థులకు 16వ తేదీ తిరుపతి నుండి ఆన్లైన్ ద్వారా ఫైనల్ రౌండ్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 20వతేదీన బహుమతుల ప్రదాన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ పోటీల్లో పాల్గోనేందుకు 9,10 తరగతులు చదువుతున్న విద్యార్థులు తమ పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఈమెయిల్ తదితర వివరాలను వాట్సాప్ నంబర్లు 8712480430కు 10వతేదీ సాయంత్రం 5గంటలలోపు, సృజనాత్మకత ఆలోచనలతో తెలుగు, ఆంగ్ల భాషల్లో 2 నిమిసాల నిడివితో వీడియోస్ ను 8712480431కు డిసెంబర్ 16వతేదీ సాయంత్రం 5గంటల లోపు పంపించాలన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: