ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభం కానుంది. ఆధ్మాత్మిక నగరం తిరుపతిలో స్పేస్ సిటీ (Space City) ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పేస్ సిటీ ప్రాజెక్టు తొలి విడతను త్వరలోనే ఏపీ ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు తెలిసింది. తిరుపతిలో 2800 ఎకరాలలో స్పేస్ సిటీ ప్రాజెక్టు చేపడుతున్నారు. మరో రెండు నెలలలో ఈ ప్రాజెక్టు తొలి విడతను చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రీసెర్చ్, శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏరోస్పే్స్ టెక్నాలజీ హబ్‌గా ఈ స్పేస్ సిటీని తీర్చిదిద్దాలని ప్రణాళికలు రచిస్తున్నారు.
Read Also: Anantapur Minerals: ఏపీలో ఖరీదైన అరుదైన ఖనిజాలు గుర్తింపు
బుచ్చినాయుడు కండ్రిగ ప్రాంతంలో ప్రాజెక్టు ఏర్పాటు
తిరుపతి జిల్లాలోని బుచ్చినాయుడు కండ్రిగ ప్రాంతంలో ఈ మెగా స్పేస్ సిటీ ప్రాజెక్టు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో చేపడుతున్నారు. స్పేస్ సిటీ ప్రాజెక్టు (Space City) మొదటి దశలో 570 ఎకరాలలో 140 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కోర్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ మొదలు పెడతారు. మిగతా భూమిని రెసిడెన్సియల్ జోన్లు, ఇన్‌స్టి్ట్యూషనల్ క్యాంపస్, లాజిస్టిక్ పార్కులు, అంతర్గత రహదారుల అభివృద్ధి , హైస్పీడ్ ఇంటర్నెట్, కరెంట్, తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయోగిస్తారు.
స్పేస్ సిటీలో ఉపగ్రహాల అసెంబ్లింగ్, టెస్టింగ్, ఆర్‌అండ్‌డీ కేంద్రాలతో పాటు స్పేస్ టెక్ స్టార్టప్‌లకు ఇంక్యుబేషన్ హబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. శ్రీహరికోట స్పేస్ సెంటర్, తిరుపతి విమానాశ్రయం, జాతీయ రహదారులు, పోర్టులకు సమీపంగా ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు. స్పేస్ సిటీ ప్రాజెక్టుతో ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, టెక్నీషియన్లు, డేటా నిపుణులు సహా అనుబంధ రంగాల్లో విస్తృతంగా ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాథమిక సర్వేలు, పర్యావరణ అంచనాలు, స్థానికులతో సంప్రదింపులు ఇప్పటికే పూర్తయ్యాయి. తొలి విడతను త్వరలోనే ఏపీ ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు తెలిసింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: