Guntakal గుంతకల్లు రైల్వే : ప్రస్తుత దీపావళి, (Diwali) ఛాత్ పండుగల సీజన్లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో టిక్కెట్లు లేకుండా/సరైన టిక్కెట్లు లేని ప్రయాణికుల నుంచి రికార్డు స్థాయిలో దక్షిణ మధ్య రైల్వే కోటి రూపాయలకు పైగా అపరాధ రుసుము వసూలు చేసి రికార్డు నెలకొల్పింది. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఇతి పాండే ఆదేశాల మేరకు మంగళవారం రైల్వేజోన్ వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు జరిగాయి. ఈ ప్రత్యేక టికెట్ తనిఖీలలో జోన్ ఒకే రోజు అత్యధికంగా రూ.1.08 కోట్ల రూపాయలను రైల్వే జోన్ సాధించింది. టికెట్ లేని ప్రయాణం లేదా అనధికారికంగా ప్రయాణించిన ప్రయాణీకుల నుంచి మొత్తం 16,105 కేసులను నమోదు చేసి, ఆ మొత్తాన్ని వసూలు చేయబడ్డాయి. మంగళవారం ప్రత్యేక స్క్వాడ్ బృందాలు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో దక్షిణ మధ్య రైల్వే జోన్ చరిత్రలో ఒకే రోజు ఆదాయం కోటిరూపాయల మైలురాయిని దాటడం ఇదే ప్రథమం.
AP: డిజిపి నిద్రపోతున్నారా? రాష్ట్ర పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
Guntakal
భారతీయ రైల్వే అన్నిజోన్ల కంటే మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో ఒక కోటి, ఎనిమిది లక్షల రూపాయలను వసూలు చేయడం రికార్డు. Guntakal ఈ తనిఖీలలో డివిజన్ల వారిగా వసూలు చేసిన మొత్తం వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ (vijayawada) డివిజన్లో అత్యధికంగా రూ.36.91 లక్షలు, గుంతకల్లు డివిజన్ రూ.28 లక్షలు, సికింద్రాబాద్ డివిజన్ రూ.27.9 లక్షలు, గుంటూరు డివిజన్ రూ.6.46 లక్షలు, హైదరాబాద్ డివిజన్ రూ.4.6 లక్షలు, నాందేడ్ డివిజన్ రూ.4.08 లక్షలు వసూలు చేశారు.
ఆకస్మిక తనిఖీలలో ఒక్క రోజే ఎంత ఆదాయం ఏర్పడ్డింది?
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఒక్క రోజే రూ.1.08 కోట్ల పైగా ఆదాయం వసూలు చేసింది.
ఈ తనిఖీలలో ఎన్ని కేసులు నమోదు అయ్యాయి?
16,105 కేసులు నమోదు చేయబడ్డాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: