📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Speaker Ayyanna Patrudu: విశాఖ వేదికగా దక్షిణాది రాష్ట్రాల ఎమ్మెల్యేల క్రీడాపోటీలు

Author Icon By Saritha
Updated: February 27, 2026 • 12:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Speaker Ayyanna Patrudu: ఆంధ్రప్రదేశ్ (AP) శాసనసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యేల క్రీడా సంబరాలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, గత రెండు రోజులుగా క్రీడల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతో చురుగ్గా పాల్గొన్నారని, ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలు మైదానంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారని కొనియాడారు. నిత్యం రాజకీయ ఒత్తిళ్లతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు, ఆ టెన్షన్లను పక్కన పెట్టి పూర్తిస్థాయి క్రీడాకారుల్లా మైదానంలో రాణించడం ఎంతో సంతోషాన్నిస్తుందని ఆయన పేర్కొన్నారు. అందరిలో కనిపిస్తున్న ఈ క్రీడా స్ఫూర్తితోనే తనకొక వినూత్న ఆలోచన వచ్చిందని, త్వరలోనే దాన్ని ఆచరణలో పెడతామని ఆయన స్పష్టం
చేశారు.

Read Also: AP House Pattas: అక్రమ ఇళ్ల పట్టాలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం

Speaker Ayyanna Patrudu: Sports competitions for MLAs from southern states to be held in Visakhapatnam

ఆరు రాష్ట్రాల ఎమ్మెల్యేలతో మెగా టోర్నమెంట్

దక్షిణ భారతదేశంలోని ఆరు రాష్ట్రాలకు చెందిన శాసనసభ్యులతో విశాఖపట్నం వేదికగా భారీ క్రీడాపోటీలను నిర్వహించనున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి రాష్ట్రాల ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించి భారీ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంతో పాటు, బీచ్ వాలీబాల్, కబడ్డీ వంటి క్రీడలకు కూడా అనుకూలమైన వాతావరణం ఉందన్నారు.

ప్రజల సహకారం కోరిన స్పీకర్

ఈ మెగా క్రీడా సంబరాల ద్వారా దక్షిణాది రాష్ట్రాల మధ్య ఐక్యతను చాటడమే కాకుండా, రాజకీయంగా ఎలాంటి సమస్యలు, భిన్నాభిప్రాయాలు ఉన్నా క్రీడాస్ఫూర్తితో అంతా ఒకే వేదికపైకి వస్తామనే బలమైన సందేశాన్ని దేశం మొత్తానికి చాటిచెప్పవచ్చని ఆయన ఆకాంక్షించారు.రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా జరగనున్న ఈ ప్రతిష్టాత్మక సౌత్ జోన్ ఎమ్మెల్యేల క్రీడా పోటీలను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) “అధ్యక్షులు కేశినేని చిన్ని ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తామని స్పీకర్ వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా నిర్వహించ తలపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పత్రికా, మీడియా ప్రతినిధులతో పాటు రాష్ట్ర ప్రజలందరి సహకారం, ఆశీస్సులు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

MLAs Sports Meet South Indian MLAs Cricket Tournament Speaker Ayyanna Patrudu Visakhapatnam Sports

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.