సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పండుగ సమయంలో స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేసిన రైల్వే శాఖ, మొత్తం 11 అదనపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు(SCR) జనవరి 6 నుంచి 11వ తేదీ వరకు వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించనున్నాయి.
Read Also: AP: నేడు ఏపీ కేబినేట్ సమావేశం
స్థిరమైన వృద్ధి
టికెట్ బుకింగ్ సోమవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. 2025లో దక్షిణ మధ్య రైల్వేజోన్ అన్ని రంగాల్లో స్థిరమైన వృద్ధిని సాధించిందని, కొత్త రైళ్లు, సరుకు రవాణాల ద్వారా గణనీయమైన రాబడిని ఆర్జించిందని రైల్వే జీఎం తెలిపారు.దీంతో సంక్రాంతి ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: