📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Solar Power: సౌర విద్యుత్తుతో సాగునీటి సమస్యలకు పరిష్కారం: సిఎం చంద్రబాబు

Author Icon By Digital
Updated: September 2, 2025 • 12:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: వ్యవసాయ పంపుసెట్లు సౌరవిద్యుత్తు కనెక్షన్లు ఇస్తామని ఏపీ చంద్రబాబు ప్రకటించారు. దీని వలన ఇంధన ఆదాతో పాటు మిగులు సౌరవిద్యుత్తును(Solar Power) ఉత్పత్తి చేసారు. ఈ దిశలో రైతులకు పూర్తి స్దాయిలో అవగాహన కలిగించాలన్నది సీఎం చంద్రబాబు ఇంధన శాఖకు ఆదేశాలు ఇచ్చారు. సీఎం ఆదేశాలను అనుసరించి పీఎం కుసుమ్ పథకం రెండో దశను 4 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు అమలు చేయాలని ఇంధన శాఖ నిర్ణయించింది.

దీని ప్రతిపాదనను అధికారులు కేంద్రానికి పంపారు. పీఎం కుసుమ్ మొదటి దశలో 3 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఫీడర్ స్థాయిలో మినీ సౌర ప్రాజెక్టుల(Solar projects)ఏర్పాటుకు ఇప్పటికే అధికారులు టెండరు ప్రక్రియను పూర్తి చేశారు. సంప్రదింపుల తర్వాత యూనిట్ తక్కువ ధరకు ఇచ్చేందుకు అంగీకరించిన కాంట్రాక్టర్లుకు అధికారులు ఎల్వోఏ ఇచ్చారు.

మూడు డిస్కంల పరిధిలో కలిపి ఒక్క యూనిట్కు సగటున రూ.3.17 చొప్పున గుత్తేదారులు కోట్ చేశారు. ప్రస్తుతం ఆ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ పథకం కింద ప్రభుత్వం రాయితీగా చెల్లించే మొత్తంతో పోలిస్తే మినీ సౌర ప్రాజెక్టుల ద్వారా వచ్చే విద్యుత్ తీసుకోవడం వల్ల ప్రతీ సంవత్సరం రూ.81 కోట్లు ఆదా అవుతుందని అధికారులు లెక్కించారు. పీపీఏ వ్యవధిలో 25 సంవత్సరాల్లో రూ.2,035 కోట్లు ఆదా అవుతుందని అంచనా. మూడు డిస్కంలలోనూ కలిపి 1,162.80 మెగా వాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. రెండో దశ ప్రాజెక్టును 2026 నుంచి కేంద్రం అమలు చేయనుంది.

వీటి ద్వారా 2027-28 నుంచి విద్యుత్(electricity)అందుబాటులోకి రానుందని వెల్లడించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందం అమలులో ఉండే 25 సంవత్సరాల్లో సుమారు రూ.6,351 కోట్లు ఆదా అవుతుందని అధికారులు లెక్కలు తేల్చారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను అధికారులు కేంద్రానికి పంపించారు. ఫీడర్ స్థాయిలో మినీ సౌర ప్రాజెక్టుల ఏర్పాటు వల్ల విద్యుత్ పంపిణీ, సరఫరా, టెక్నాలజీ నష్టాలు భారీగా తగ్గుతాయని వారు తెలుపుతున్నారు. పీఎం కుసుమ్ కింద మొదటిదశలో 3 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

దీని కోసం 1185 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు డీపీఆర్లను కేంద్రానికి సర్కార్ పంపింది. తర్వాత మరో 2 లక్షల కనెక్షన్లకు సరిపడా ప్రాజెక్టులకు అనుమతి తీసుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. దశలవారీగా 3725 మెగావాట్ల మేర మినీ సౌర విద్యుత్(Solar Power) ప్రాజెక్టులు అందుబాటులోకి తేవాలని సర్కార్ భావిస్తోంది. మొదటిదశలో ప్రతిపాదించిన ప్రాజెక్టుల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ చేపట్టింది. ఈ పథకం కింద ఏర్పాటు చేసే ప్రాజెక్టులకు కేంద్రం మెగావాట్కు రూ.1.04 కోట్లు రాయితీ కింద అందించనుంది.

Read Hindi news: Hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ap-bar-another-notification-for-bar-license-in-ap/andhra-pradesh/539834/

Andhra Pradesh News Andhra Pradesh Solar Power AP Energy Department Solar AP News AP Solar Pumpsets Chandrababu Solar Pumpset Scheme Latest In telugu news Solar Energy for Farmers Telugu News Today AP news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.