భారతదేశం వ్యవసాయ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులతో పాటు వ్యవసాయం చేసే విధానాల్లోఅనేక సాంకేతిక ఉపకరణాలు రైతులకు అందుబాటులోకి వస్తూ వ్యవసాయ సాగును సులభతరం చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయి లో రైతులు అంతర్గతంగా భూసార పరిరక్షణకు పంట మార్పిడి, సేంద్రియ విధానాలపై సరైన రీతిలో ఆసక్తిచూప లేకపోవడమో లేక వ్యవసాయంలో మోతాదుకు మించిన కృత్రిమ రసాయన ఎరువుల వాడకం లేకుంటే మార్కెట్లో నకిలీ విత్తనాల చలామణి లాంటి అంశాల వలన రైతులు ప్రకృతి వైపరీత్యాల వలన కలిగే అనర్థాలు కంటే ఎక్కువగా నష్టపోతున్నారు అనే సంశయం కలగక మానదు. వ్యవ సాయ రంగంలో ఆధునిక సాంకేతిక ఉపకరణాలు వ్యవసా యం చేయడానికి సహకరిస్తున్నా భూమిలో ఉన్నటువంటి నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం లాంటి పోషకాలు మొక్క ల పెరుగుదలకు వినియోగం అయ్యే క్రమంలో తరచుగా భూసారం తగ్గిపోవడం సహజమే. అయితే తిరిగి మరల భూసారాన్ని పెంచుకునే విధంగా పంట మార్పిడి సాంప్రదా య విధాన పద్ధతులతోపాటు సేంద్రియ ఎరువుల వాడకం తో భూసారాన్ని పెంపొందించి అధిక పంట దిగుబడిని పెంచుకునే విధానమే సరైనది అనే అభిప్రాయం వ్యవసాయ రంగంలో తరచుగా వినిపిస్తుంటాయి. వ్యవసాయదారులు వాణిజ్యపరమైన నిత్యావసర ఆహార పంటలను పండించేం దుకు ఆసక్తి చూపుతున్న, పంట దిగుబడి త్వరగా రావడా నికి అనేక రకాల రసాయన ఎరువులను వాడుతున్న ప్పటికీ తర్వాతి క్రమంలో అనేకసార్లు నష్టాల బారినపడుతుండటం శోచనీయం.
Read Also : http://Jithendra Singh: 2032 నాటికి 17 అణు విద్యుత్ రియాక్టర్ల నిర్మాణం

అధిక దిగుబడి
ముఖ్యంగా భూమిలో ఆరోగ్యకరమైన మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే నైట్రోజన్, ఫాస్ఫరస్, పోటాష్లాంటి ప్రాథమిక పోషకాలను మొక్కలు భూమి నుండి గ్రహిస్తాయి తద్వారా పోషకాలు శాతం భూమిలో తగ్గుతూ వస్తుంటాయి కాబట్టి సహజంగా జీవ సంబంధమైన వ్యర్థా లు, వర్మీకంపోస్ట్ లాంటి వాటిని తరచుగా భూమిలో ఉప యోగిస్తుంటే భూసార పరిరక్షణ ఎప్పుడు నిలకడగా ఉండ డమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో దోహ దపడుతుంది. పంటలకు చీడపీడ పురుగులు హానికర, తెగు లు లాంటివి రాకుండా రక్షింపపడడమే కాకుండా మొకక్కులు వైరస్ బ్యాక్టీరియా ఫంగస్ తెగుళ్లను తట్టుకుని నిలిచే విధంగా ఉండి రైతులకు అధిక దిగుబడి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అంతేకాకుండా సేంద్రియ విధానంతో పండించిన పంటలకు మార్కెట్లో చాలా ప్రాముఖ్యత ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పశు సంపదకు కొదువలేనప్పటికీ, సాధ్యమైనంతగా పశువుల నుండి వచ్చే వ్యర్థాలను ఎరు వులుగా వాడే విధానం సాంప్రదాయ వ్యవసాయ రంగంలో చాలావరకు తగ్గుతూ వస్తుంది. దీనికి ప్రధాన కారణం రైతులు కృత్రిమ రసాయన ఎరువులమీదనే ఆధారపడడం సర్వ సాధారణంగా గోచరిస్తుంది. రసాయన ఎరువులు ఉపయో గించే విధానంలో కూడా అనుకున్న స్థాయిలో పంటలపై సరియైన రీతిలో పిచికారి చేయకపోవడం రసాయనాలు నేరుగా గాలి ద్వారా వాతావరణంలోకి చేరి పర్యావరణాన్ని కూడా ఇబ్బందిని కలిగిస్తూ మానవ జీవన ఆరోగ్య స్థితిగతు లపై ప్రభావితం చూపిస్తున్నాయి. పర్యావరణానికి నష్టం కలిగించని సహజమైన సేంద్రియ ఎరువుల విధానాన్నిపంట మార్పిడి విధానాన్ని ఎక్కువగా రైతులు అవలంబిస్తే మంచి పోషక విలువలతో కూడినటువంటి పంటలను భావితరాల కు అందించడమే కాకుండా శ్రేష్ఠమైన బలవర్ధకమైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశం అధికంగా ఉంటుంది. పశువుల నుండి వచ్చే జీవ సంబంధమైన వ్యర్థాలు వృక్ష సంబంధమైన ఎరువులు భూసారాన్ని పరీక్షించు కునేందుకు (Soil testing)దోహదం చేస్తాయి. కాబట్టి జీవ వృక్ష సెంద్రీయ ఎరువులను తరచుగా అవసరమైన మేరకు పంట పండించే భూమిలో వేయడం వల్ల భూసారం తగ్గకుండా పంటలు అధిక దిగుబడి రావడానికి మొక్కలకు ఎంతో సహాయం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా భూమిలో నిరంతరం ఒకే పంట వేయకుండా ప్రతి సంవత్సరం పంట మార్పిడి చేయ డం ద్వారా భూసారం తగ్గకుండా రసాయన ఎరువులకు అధిక ప్రాధాన్యత ఇవ్వకుండానే పంట ఎదుగుదలకు దోహ దం చేసి అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది.

పంట మార్పిడి
దేశంలో కొన్నిరాష్ట్రాల్లో తప్ప చాలావరకు రైతులు సేంద్రియ విధానాన్ని చేయడంలో ఆసక్తి చూపలేకపోతున్నారు ఏమో కానీ కొందరు రైతులు రసాయన ఎరువుల వాడకం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుండడం కొంతకాలం తర్వాత వ్యవసాయంలో పంటల దిగుబడి తగ్గిపోయి నష్టాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుత కాలంలో సేంద్రియ పద్ధతుల్లో పండించిన ఆహార ఉత్పత్తులు ఆకుకూరలు, కూరగాయలు వాణి జ్య వ్యాపార పంటలు వరి, మొక్కజొన్న, పసుపు మిరప పప్పుడినుసులు, లాంటి వాణిజ్య వ్యాపార పంటలకు దేశీయ మార్కెట్ తోపాటు అంతర్జాతీయంగా ఎగుమతుల్లో అధికంగా గిట్టుబాటు ధర ఉంది. అంతేకాకుండా ఆధునిక జీవన విధానాల్లో ప్రజలు కూడా సేంద్రియ ఎరువుల విధానంతో పండిన పంటలపై అవగాహన పెంచుకుంటున్న దృష్ట్యా ఆరోగ్య రీత్యా కొనుగోలు విషయంలో సేంద్రియ ఎరువుల విధానం ద్వారా పండిన పంటలకు కొంతైనా ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వచ్చినా భూసారం తగ్గకుండా ప్రత్యేక దృష్టి సారించాల్సిన బాధ్యత చాలా వరకు రైతులపైనే ఉంటుందనే భిన్నవాద నలు లేకపోలేదు. కొన్నిసార్లు వ్యవసాయ రంగంలో తరచుగా దిగుబడి తక్కువ వస్తుండడం వీటికి ప్రధాన కారణాలు అన్వేషించి దానిని అధిగమించడానికి వ్యవసాయ సాగుకు మూలాధారమైన సేంద్రియ ఎరువుల విధానం, పంట మార్పి డి విధానాలే పరిష్కారం అనే విధానాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత రైతాంగానికి ఉంది. ఈ క్రమంలో నిరంతరం పండించిన పంటవేయకుండా పంట మార్పిడి చేస్తూ వ్యవ సాయం అభివృద్ధిలో వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ రైతాంగం నష్టాలను సాధ్యమైనంతగా తగ్గించుకోవచ్చు. ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యవసాయ రం గంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని చెబుతున్న ప్పటికీ, సహజంగా భూసారంలో పోషక పదార్థాలను అభి వృద్ధిపరిచే విధానాలను ఆధునిక నవీన పద్ధతులతో రూపుడిద్దుకోవాల్సిన అంశాలలో విప్లవాత్మకమైన మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యవసాయ రంగంలో సుల భతరమైన ఆధునిక సాంకేతిక ఉపకరణాలు ఎన్నో వస్తున్నా భూసారాన్ని పరీక్షించుకునే (Soil testing) విధానాలు సరిగాలేకపోతే వ్యవ సాయ అభివృద్ధిలో రైతులకు ఆధునిక ఉపకరణాలు కావల సినంత ఉపయుక్తం ఏమాత్రం కావేమో. అదేవిధంగా రైతు లు కూడా తమ వ్యవసాయ ఉత్పత్తులను సమృద్ధిగా పం డించేందుకు వ్యవసాయ భూముల్లో భూసారం తగ్గకుండా పంట మార్పిడి సహజమైన సేంద్రియ ఎరువులు వాడకం విధానాన్ని రూపొందించే ప్రణాళికను సిద్ధం చేసుకుని వ్యవ సాయంచేస్తూ నష్టపోకుండా ఆర్థికస్వావలంబన దిశగా ముం దుకు పురోగమించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
-దాడిశెట్టి శ్యామ్ కుమార్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: