Social media: విద్యార్థుల ఆవేదన విని చలించిపోయిన పవన్ కల్యాణ్

Read Time:  1 min
Social media: విద్యార్థుల ఆవేదన విని చలించిపోయిన పవన్ కల్యాణ్
FONT SIZE
GET APP

పవన్ సర్ రోజూ బురదలో నడుస్తూ స్కూలుకు వెళ్లలేకపోతున్నాం. దయచేసి మా ఊరికి రోడ్డు వేయండి అంటూ విద్యార్థులు చేసిన విన్నపం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కదిలించింది. సామాజిక మాధ్యమాల్లోని ఒక వీడియోలో (Social media) విద్యార్థులు పడుతున్న వేదనను చూసి చలించిపోయిన ఆయన, తక్షణమే స్పందించి గంటల వ్యవధిలోనే రోడ్డు నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

Read Also: SSC Board: టెన్త్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు

Social media: విద్యార్థుల ఆవేదన విని చలించిపోయిన పవన్ కల్యాణ్

గజ్జలవారిపల్లికి రూ.86 లక్షలతో తక్షణమే రోడ్డు మంజూరు

కొండాపురంలోని గజ్జలవారిపల్లి గ్రామ విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే ఆ దారి బురదమయంగా మారి నరకాన్ని తలపిస్తోంది. తమ గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో, వారు తమ కష్టాలను వివరిస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

శుక్రవారం ఈ వీడియో(Social media) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(CM Pawan) దృష్టికి వచ్చింది. విద్యార్థుల ఆవేదనను చూసిన ఆయన వెంటనే నెల్లూరు జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలను వెంటనే రూపొందించి, పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అధికారులు వెంటనే స్పందించి 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 86 లక్షలతో అంచనాలు సిద్ధం చేసి, పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గజ్జలవారిపల్లి విద్యార్థులకే కాకుండా, పొలాలకు వెళ్లే రైతులకు కూడా ఏళ్లనాటి కష్టాలు తీరనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.