పుస్తక పఠనం ఆధునిక తరా నికి భారంగా మారింది. చర వాణి సర్వస్వంగా మారింది. జ్ఞానా నికి నిలయాలైన గ్రంథాలయాలు పాఠకులు లేక వెలవెల బోతున్నా యి. ఫేస్ బుక్,ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, ఎక్స్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ ప్లాట్ ఫాంలు ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రాచుర్యం పొంది, కోట్లాది మంది ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. సాంకేతిక విప్లవం జనబాహుళ్యంలోకి చొచ్చుకు వచ్చింది. వర్తమాన ప్రపంచంలో సోషల్ మీడియా గురించి ఎంత చెప్పినా తక్కువే. జని లాంటి ఉద్యమాలతో ప్రభుత్వాల ను కూలగొట్టిన చరిత్ర సోషల్ మీడియాదే అని చెప్పక తప్పదు. గూగూల్ సెర్చ్ ఇంజన్ను ప్రపంచవ్యాప్తంగా నేటికీ 90శాతం మంది ప్రజలు అనుసరిస్తున్నారు. గూగూల్ కు ప్రత్యామ్నాయంగా అనేక సెర్చ్ ఇంజన్లు అందుబాటులోకి వచ్చాయి. డక్ డక్ గో, స్టార్ట్ పేజ్, బ్రేవ్ సెర్చ్, బింగ్ డాట్ కామ్, చాట్ జిపిటి వంటి వ్యవస్థలు పుట్టు కొచ్చాయి. ఆర్టిఫీషియల్ఇంటిలిజెన్స్ సమాచార శోధనలో సరికొత్త విప్లవం సృష్టించింది. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతూ, కోట్లాది మంది యువతను బానిసలుగా మార్చింది. సోషల్ మీడియా(Social media) ఒక వ్యసనంగా రూపాంతరం చెందింది. ఈ కార ణంగానే సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలని, పిల్లలను చరవాణికి దూరంగా ఉంచాలని పలువురు మేథావులు సూచిస్తున్నారు.16 సంవ త్సరాల లోపు వయసు గల వారికి సోషల్ మీడియా(Social media)ను దూరం చేస్తూ ఆస్ట్రేలియా ఒక అరుదైన నిర్ణయం తీసుకుని అమలు చేయడం సముచితమే అయినా, ఇది ఆచరణలో విఫలం కాక తప్పదు.
Read Also : YouTube: తొలగిన యూట్యూబ్ అంతరాయం
వినియోగం ఎంతో అధికం
ఇటీవల లోక్సభలో తెలుగు దేశం పార్టీ 16 సంవత్సరాలలోపు వయసు గల వారికి సోషల్ మీడియా నిషేధించాలని ఒక ప్రైవేటు బిల్లు ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రతిపాదన ఉద్దేశ్యం మంచిదే అయినా ఇది ప్రైవేటు బిల్లు కాబట్టి లోక్సభలో దీనికి తగిన ప్రాధాన్యత లభించబోదు. నేడు సోషల్మీడియాను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వినియోగిస్తున్నారు. ఇది ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువ. ఇంత బహుళ ప్రాచుర్యం పొందిన సోషల్ మీడియాను సుమారు 69 శాతం మంది వివిధ అవసరాలకు వినియోగిస్తున్నారు. 80 శాతం పైగా అమెరికన్లు సాంఘిక మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నారు. చైనా లో 100 కోట్లమంది సోషల్మీడియా యూజర్లున్నారు. 30 సంవత్సరాల లోపు వయసు గల సుమారు 58శాతంమంది టిక్ టాక్ ఉపయోగిస్తున్నారు. చైనాలో ఫేస్బుక్ యూజర్ల సంఖ్య మిలియన్ల సంఖ్యలోఉంది. అయితే ఇతర దేశాల్లో దీని వినియోగం ఎంతో అధికం. సోషల్ మీడియా ప్లాట్ ఫాం వ్యాపారాభివృద్ధికోసం, వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయం సమకూర్చుకోవడం కోసం,ఉపాధి అవకాశాల కోసం, కెరీర్ను తీర్చిదిద్దుకోవడం కోసం ఉపయోగపడుతు న్నది. తమ ప్రతిభ కేవలం నాలుగు గోడల మధ్య నలిగి పోకుండా ప్రపంచానికి పరిచయం చేయడం కోసం చాలా మంది సాంఘిక మాధ్యమాలను వినియోగిస్తున్నారు. సాం ఘిక మాధ్యమాల ద్వారా ధనార్జన చేస్తున్నవారు కోకొల్లలు. అవకాశాల కోసం ఎదురు చూసే వారికి సోషల్మీడియా ఒక కొంగుబంగారం. స్మార్ట్ఫోన్ వినియోగదారుడు ప్రతీ రోజు సగటున సుమారు 4గంటలకు పైగా సమయం వెచ్చి స్తున్నాడు. ప్రతీ నెలలో సుమారు 70-75 గంటల సమయాన్ని సోషల్ మీడియా యాప్స్కు వెచ్చిస్తున్నారు. సుమా రు 500కోట్ల జనాభా అనగా ప్రపంచ జనాభాలో సుమారు 62శాతం మంది ప్రజలు సోషల్ మీడియా ఖాతాలు కలిగి ఉన్నారు. ప్రతీ రోజు బిలియన్ల సంఖ్యలో ప్రపంచంలోని పలువురితో ఆత్మీయంగా కలిసే అవకాశాన్ని సోషల్ మీడి యా సుసాధ్యం చేస్తున్నది. యాపిల్ ఐఫోన్ సోషల్మీడియా జతకాన్ని ఓ మలుపు తిప్పింది. ఇప్పుడు దాదాపు అన్ని బ్రాండెడ్ ఫోన్లలో వివిధ అప్లికేషన్లు యూజర్లను విపరీతం గా ఆకర్షిస్తున్నాయి.
ఖర్చులను పెంచేసుకుంటున్నాం
సోషల్ నెట్వర్కింగ్ యాప్స్ ద్వారా లభిస్తున్న యూట్యూబ్, టిక్టాక్, వాట్సప్, స్నాప్ చాట్, ట్విట్టర్, పిన్ టెరెస్ట్, లింక్డ్ఇన్లు బాగాప్రాచుర్యం పొందాయి. ఒక ప్పుడు మన అభిప్రాయాలను వేరొకరితో పంచుకోవడానికి, మనల్నిమనం ఇతరులకు పరిచయం చేసుకోవడానికిమనం వ్రాసే పుస్తకాలు, పత్రికా వ్యాసాలు, మనం పాల్గొనే సమా వేశాలు, ప్రసంగాలు ఎంతగానో ఉపయోగపడేవి. అయితే వర్తమానంలోవీటితో పెద్దగా అవసరం లేదు. ప్రతిభఉన్నా లేకపోయినా ఇష్టమైన రీతిలో అడ్డదిడ్డమైన పోస్టులు పెట్ట డం, వీడియోలు పోస్టుచేయడం, అనవసరమైన గొడవలతో రచ్చచేయడం వాటిని ఆస్వాదించే జనం పెరగడం చూస్తు న్నాం. ఎవరికివారు సోషల్ మీడియా సామ్రాజ్యానికి రారా జుల్లా వెలిగి పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను సృష్టించి, తమ వ్యాపారాలను బిలియన్ల కోట్ల డాలర్లకు పెంచేసుకుంటూ కుబేరులుగా మారిపోయిన వారిని ఊహించుకుంటూ, మన సమయాన్ని వృథా చేస్తున్నాం. రోజూ జిబిల కొద్దీ డేటాను కొనుగోలు చేసి, అవసరం లేకున్నా మన ఖర్చులను పెంచేసుకుంటున్నాం. ఒకప్పుడు కారు చౌకగా లభించిన మొబైల్ డేటా నేడు విపరీతంగా పెరిగింది. అపరిమితమైన వాయిస్ కాల్స్ నేడు ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి. సెల్ఫోన్ ఖర్చులు సామాన్య ఫోన్ వినియోగ దారుల, స్మార్ట్ఫోన్ వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. దూరాన్ని దగ్గరచేసి, టెక్నాలజీ సహాయంతో ప్రపంచాన్ని మన చెంతకు చేర్చి, మన అభిప్రాయాలను, మన సంస్కృతీ సాంప్రదా యాలను, మన ఆచార వ్యవహారాలను మిగతా ప్రపంచా నికి దగ్గర చేసే సోషల్ మీడియా నేడొక అవసరంగా మా రింది. సాంఘిక మాధ్యమాలను వినియోగించడానికి మన కొక ఎలక్ట్రానిక్ పరికరం అవసరం. అది కంప్యూటర్ కావచ్చు. ల్యాప్టాప్, డెస్క్టాప్ కావచ్చు లేక ట్యాబ్, మొబైల్ కావ చ్చు. ఏదిఏమైనా నేటి కాలానికి అత్యంత సౌకర్యవంతమైన సాంకేతిక సాధనంగా మొబైల్ జన హృదయాలను దోచు కుని, మనల్ని ఒక అద్భుతమైన ప్రపంచానికి తీసుకుపో యింది. మొబైల్ జీవితంలో ఒక విడదీయరాని సంబంధం గా, ఒక వ్యాపకం మారిపోయింది.
పతనంవైపు పరుగులు
ఈసంవత్సరం ప్రారం భానికి ప్రపంచంలో 6 బిలియన్లమంది ఇంటర్నెట్ వినియో గిస్తున్నారని ఒక అంచనా. ఇది ప్రపంచ జనాభాలో సుమారు 67 శాతంగా ఉంది. ప్రపంచ జనాభాలో సుమారు 60 శాతం మంది సోషల్ మీడియా ఉపయోగిస్తున్నట్టు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడానికి శత విధాలా ప్రయత్నించినా దక్కని ఫలితం సోషల్ మీడియాకు మాత్రం దక్కింది. డిజిటల్ ప్రపంచంలో నిరక్షరాస్యులు కూడా భాగస్వామ్యం వహించడం ఆశ్చర్యకరమైనా, ప్రజల ఆసక్తి డిజిటల్ ప్రపంచాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఇన్స్టా గ్రాం యూజర్లు ప్రపంచ వ్యాప్తంగా 3 బిలియన్లుగా అంచనా వేసారు. ఇండియాలో దీని సంఖ్య సుమారు 392 మిలియన్లు. ఇండియాలో ఫేస్ బుక్యూజర్లు 58 కోట్ల వరకు ఉండవచ్చు. ఫేస్బుక్ (మెటా యాజమాన్యం) గతంలోనే వాట్సాప్, ఇన్ స్టాగ్రాం లను కొనుగోలు చేసింది. ఫేస్బుక్ 2025 వ సంవత్సరం లో దాదాపు 200బిలియన్ డాలర్ల ఆదాయాన్నిఆర్జించింది. ప్రపంచంలో ట్విట్టర్ నేలవారీ యూజర్ల సంఖ్య 600 మిలి యన్లుదాటింది. అలాగే సోషల్ మీడియాలో గేమింగ్ బాగా ప్రజాదరణ పొందింది. వీటికి సంబంధించిన అనేక యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. సోషల్ మీడియా నెట్వర్కిం గ్కు ప్రధాన ఆదాయం ప్రకటనల ద్వారా సమకూరుతుంది. ప్రకటనల ద్వారా వీటి ఆదాయం బాగా పెరిగింది. సోషల్ నెట్వర్క్ ఖాతాలో 5.6 బిలియన్లకు పైగా వినియోగదారులున్నారు. సోషల్ మీడియా వరమా? శాపమా? అనే సంశయం కలుగకమన పంచేంద్రియాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానపు చట్రంలో ఇరుక్కుమానదు. వర్తమాన సమాజంలో నెలకొంటు న్న అస్తవ్యస్థ పోకడలను చూస్తే ఈ సందేహం సహేతుకమే పోయాయి. ఎక్కడున్నా మన ఆలోచనలుమొబై ల్ ఫోన్ స్క్రీన్ మీదే కేంద్రీకరింపబడుతున్న మాటకాదన లేం. యువతలో పెరిగిన సోషల్ మీడియా ప్రభావం నైతిక పతనంవైపు పరుగులు పెట్టిస్తున్నది. సామాజికమాధ్యమాల్లో లోపిస్తున్నసంస్కారం సమాజానికి హానికరంగా మారింది.
-సుంకవల్లి సత్తిరాజు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: