ఈమధ్య తరచూ స్లీపర్ బస్సు ప్రమాదాల గురించి చదువుతున్నాం. ఈ ప్రయాణం సౌకర్యవంతంగా ఉన్న ప్పటికీ, ఇటీవల పెరుగుతున్న ప్రమాదాల కారణంగా భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్లీపర్ బన్లు (Sleeper bus)అగ్ని ప్రమాదాలకు గురికావడం, అందులోని ప్రయాణికులు మంట లకు ఆహుతై పదుల సంఖ్యలో చనిపోవడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో జరిగిన స్లీపర్ బస్ (Sleeper bus) ప్రమాదంలో 20 మందికి పైగా చనిపోవడం అందరినీ కలచి వేసింది. కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగిన రోడ్డు ప్రమాదం లో 20మందికి పైగా సజీవ దహనమయ్యారు. హైవేపై బస్సు వేగంగా వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న ఓ కంటైనర్ లారీ.. అకస్మాత్తుగా డివైడర్ను దాటుకొని వచ్చి బస్సును ఢీకొట్టింది. సరిగ్గా బస్సు డీజిల్ ట్యాంక్ వద్ద ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. స్లీపర్ బస్సులో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకునేలోపే, మంటల్లో కాలి బూడిదయ్యారు.
Read Also: http://Indian Railways: కేంద్ర రైల్వేశాఖ శుభవార్త.. మరో 12 వందే భారత్ స్లీపర్ రైళ్లు
భద్రతాపరంగా సరైనవి కావు
స్లీపర్ బస్సులు సౌకర్యవంతంగా ఉన్నప్ప టికీ అగ్నిప్రమాదాలు, ప్రమాదాల సమయంలో భద్రతపై ఆందోళనలు ఉన్నాయి. ఎందుకంటే ఎగువ బెర్త్లో ఉన్న వారు త్వరగా బయటపడటం కష్టం. కొన్నిబస్సులలోసరైన అత్యవసర నిష్క్రమణలు, వెంటిలేషన్ ఉండవు. చైనావంటి దేశాలు వీటిని నిషేధించాయి. కాబట్టి పేరున్న ఆపరేటర్లను ఎంచుకోవడం భద్రతా లక్షణాలను తనిఖీ చేయడం బస్సు రోడ్డుమీద వేగంగా వెళుతున్నప్పుడు రోడ్డుపై ఏవైనా వాహనాలు ఆగిఉంటే వాటిని ఢీకొనడం ద్వారా నిప్పు అంటుకు న్నప్పుడు, మూసి ఉన్న బస్సులలో పొగ వేగంగా వ్యాపి స్తుంది. నిద్రలో ఉన్న ప్రయాణికులను మేల్కొలపడంకష్టం. ప్రమాదాలు జరిగినప్పుడు, పొడవైన బెర్త్ లు ప్రయాణీకులకు సురక్షితం కాకపోవచ్చు, ఎందుకంటే ఇది గాయాలకు దారి తీయవచ్చు. అధిక లోడింగ్ వల్ల భద్రత మరింత తగ్గుతుం ది. సరైన ఫ్యాక్టరీబిల్ట్ మోడళ్లు లేకపోవడం సమస్యగా మారుతోంది. చైనా, బంగ్లాదేశ్ వంటివి స్లీపర్ బస్సులను భద్రతా కారణాల వల్ల నిషేధించాయి. స్లీపర్ బస్సులు సౌక ర్యవంతమైనవే కానీ భద్రతాపరంగా సరైనవి కావు. వాటి భద్రత చాలావరకు బస్సు నాణ్యత, ఆపరేటర్ నిబంధనలు అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తతపై ఆధారపడి ఉంటుంది. స్లీపర్ బస్సులలో సీట్లకు బదులుగా వాలు పడకలు అమర్చబడి ఉంటాయి. సాధారణ పరిస్థితులలో ప్రయాణానికి సురక్షితంగా ఉంటాయి. చాలా సందర్భాల్లో భద్రతా సమస్యలకు అవే కారణం అవుతాయి.
ఆరోగ్య సమస్యలు
ఒకవేళ స్లీపర్ బస్సు లు ప్రమాదానికి గురైతే బస్సులో ఉండే లాంగిట్యూడినల్ బెర్త్ డిజైన్, తలపై బలంగా తగిలి పెద్ద గాయాలకు కారణం అవుతుంది. వెన్నెముక సంబంధ గాయాలవుతాయి. రాత్రి పూట జర్నీ కారణంగా డ్రైవర్ అలసటకు గురయ్యే అవకా శం ఉంటుంది. తక్కువ లైటింగ్, వంకర రోడ్లు ప్రమాద అవకాశాలను పెంచుతాయి. డ్రైవర్లకు అలసట వస్తే కాసేపు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే సరైన సమయానికి వారిని వారి గమ్యస్థానాలకు చేర్చాలి. స్లీపర్ బస్సులలో ప్రయాణించడం వల్ల పలురకాల ఆరోగ్య సమ స్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. విండోలు మూసివేయడం వల్ల వాంతులు, వికారం లాంటివి కలుగుతాయి. స్లీపర్ బస్సుల్లో ప్రయాణించేవారికి వెన్నెముక, మెడపై ఒత్తిడి కలుగు తుంది. ముఖ్యంగా సుదూర ప్రయాణంలో ఈ సమస్యలు తలెత్తుతాయి. స్లీపర్బస్సులలో ప్రయాణం చేసే సమయం లో టాయిలెట్స్కు ఇబ్బంది ఉండటం వల్లన తక్కువగా నీళ్లు తాగుతారు. సేఫ్గా జర్నీచేయాలనుకునే ప్రయాణీకులు అనుభవం ట్రావెల్స్ బస్సులను ఎంచుకోవాలి. మొదట్లో కొద్దిపాటి స్లీపర్ బస్సులే నడిచేవి. క్రమంగా ఎక్కువ మంది ప్రైవేట్ ట్రావెల్ నిర్వా హకులు, సాధారణ సీటింగ్ బస్సు లను స్లీపర్
బస్సులుగా మార్చి, ఎక్కువ టికెట్ ధరలు వసూలు చేయడం ప్రారం భించారు. ఇప్పుడు చాలా బస్సు ల్లో 35 నుండి 40 వరకు బెర్తులు ఉండటంతో అటూ ఇటూ కదలడం కష్టంగా ఉంటోంది. మామూలుగా చిన్నా చితకా అగ్ని ప్రమాదానికి గురైన సమయాల్లో ప్రాణనష్టం తక్కువే ఉంటుంది. కానీ అగ్ని ప్రమాదం సంభవిస్తే ప్రయా ణికులు తేరుకునేలోగానే అగ్నికీలలు వారిని ఎలా ముంచె త్తుతాయి.
భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి
తాజాగా కర్ణాటకలో జరిగిన మరో బస్సు ప్రమా దంలో 13 మంది మృతి చెందారు. సెప్టెంబర్ 14న రాజ స్థాన్లో దగ్ధమైన ప్రైవేటుట్రావెల్స్ బస్సు. జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో భారీగా మం టలు చెలరేగి 20మంది సజీవదహనమయ్యారు. సెప్టెంబర్ 23న పెళ్లి బృందం బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. వెం టనే అప్రమత్తమైన అందరూ కిందకు దిగిన తర్వాత బస్సు దగ్ధమైంది. సెప్టెంబర్ 26న హైద బాబాద్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు వ్యాపించాయి. వెంటనే స్పం దించడంతో ప్రాణ నష్టం సంభవించలేదు. అక్టోబర్ 24న కర్నూలులో ట్రావెల్స్ బస్సు ప్రమాదం. అర్థరాత్రి బైక్ను బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో 19 మందిమృతి చెందారు. అక్టోబర్ 26న యూపీలో స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. అక్టోబర్ 29న మహారాష్ట్రలోని సమృద్ధి హైవేపై బస్సులో మంటలు వ్యాపించాయి. ఈఏడాది నవంబర్ 3న చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19మంది దుర్మరణం పాలయ్యారు. డిసెంబర్ 12నమారేడుమిల్లి వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సులోయలో పడి తొమ్మిది మంది మరణించారు. దీంతో రాత్రిళ్ళు ఈ రూట్లో బస్ ప్రయాణాలను నిషేధించారు. డిసెంబర్ 16న యూపీలోని మథురవద్ద ఎక్స్ప్రెస్ హైవేపై పొగ మంచు కారణంగా బస్సులు ఢీకొనడంతో వాహనాల్లో మంటలు చెలరేగి 13 మంది మరణించారు. డిసెంబర్ 24న తమినాడులో ఓ బస్ రెండు కార్లను ఢీకొనడంతో తొమ్మిదిమంది మృత్యువాత పడ్డారు. డిసెంబర్ 25న కర్ణాటకలో బస్సు ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. డిసెంబర్ 26న గుంటూరు జిల్లా నల్లపాడులో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మరణించారు. స్లీపర్ బస్సుల్లో ఎగువ బెర్త్కంటే సురక్షితమైనది ఏదీలేదు. బస్సులో ప్రయాణించేటప్పుడు మీ వస్తువులను భద్రంగా ఉంచుకోవాలి. ప్రయాణీకులు సౌకర్యంతో పాటు భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వాలు కఠినమైన తనిఖీలు నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
– జి.సత్యనారాయణరాజు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: