తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్స్‌లో కేవలం రూ.100కే 5 కేజీల ఉల్లి విక్రయించబడుతుంది. అంటే కిలో ధర కేవలం రూ.20 మాత్రమే. అయితే, మిగితా కూరగాయల ధరలు (Vegetables Prices) ఆకాశాన్నంటుతున్నాయి.
Read Also: Minister Lokesh: విద్యార్థినుల కోసం ‘కలలకు రెక్కలు’ పథకం: మంత్రి లోకేశ్
దీనికి ప్రధాన కారణం
ఉల్లి చౌకగా అందుబాటులో ఉన్నప్పటికీ, టమాటా ధర మళ్లీ పెరిగిపోతోంది. మార్కెట్‌ను బట్టి టమాటా రూ.50 నుంచి రూ.80 వరకు అమ్ముడవుతోంది. ఎక్కువ డిమాండ్ ఉన్నప్పటికీ సరఫరా తగ్గడం దీనికి ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
కేవలం ఇవే కాకుండా, రోజువారీ కూరగాయలైన బెండకాయ, బీరకాయ, వంకాయల ధరలు కూడా పెరిగాయి. బెండకాయ రూ.80, బీరకాయ రూ.80, వంకాయ రూ.110 వరకు పలుకుతున్నాయి.ఉల్లి చౌకగా అందుబాటులో ఉన్నా, మిగతా కూరగాయల (Vegetables Prices) ఖరీదు పెరగడం వల్ల వినియోగదారులపై భారం పడుతోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: