విజయవాడ : లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చర్మ(Skin Disease) సంబందిత వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. .ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైల్లో ఉన్న ఆయన చర్మవాధిలతో పాటు పలు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఇదే విషయాన్ని జైలు అధికారులకు ఆయన తెలియజేశారు.
Read Also: Battery Energy: వినియోగంలోకి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ విద్యుత్ సాంకేతికత!
దీంతో, ఈ విషయాన్ని జైలు అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు చెవిరెడ్డిని జైలు సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం మళ్లీ జైలుకు తరలించారు. ప్రస్తుతం చెవిరెడ్డి ఆరోగ్యం(Skin Disease) బాగుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు, గత నెల కూడా వైద్య పరీక్షల నిమిత్తం చెవిరెడ్డిని ఆసుపత్రికి తీసకెళ్లారు. వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్న ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: