ఏ దేశానికైనా నైపుణ్యాలతో కూడిన యువత ప్రధాన బలం. ప్రపంచంలో అత్యధిక యువజనాభా గల దేశం మనదే. ప్రపంచ యువ జనాభా 180 కోట్లుగా ఉంటే 28 శాతం వాటా మనదే. మరి మన యువతలో ఉండాల్సి నంత ఉత్తేజం. ఉత్సాహం ఉన్నాయా? అంటే డౌటే. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు,వజ్ర సంకల్పమున్న యువత ఈ దేశానికి అవసరం. నా నమ్మకం, ఆశ అంతా నా యువతపైనే అని స్వామి వివేకానంద చెప్పిన మాటలు ముమ్మాటికీ అక్షరసత్యాలు. ప్రశ్న ఆయుధం కావాలి. ఏ ఉద్యమం విజయవంతం కావాలన్నా, ఏ ప్రాజెక్టు పట్టాలె క్కాలన్నా యువత క్రియాశీల భాగస్వామ్యం అవసరం. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా యువతలో పెరుగుతోన్న అసంతృప్తి అంశం మీద సర్వే చేసిన ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ తన నివేదికను వెల్లడించింది. రాబోయే రోజుల్లో వచ్చే తిరుగుబాట్లలో చురుగ్గా పాల్గొంటారా..? అనే ప్రశ్న ను 35 దేశాల్లోని 18-34 ఏళ్ల మధ్య వయసున్న 5.8 లక్షలమందిని అడగగా వారిలో సగానికి పైగా అవుననటం ప్రపంచ యువత అసంతృప్తికి నిదర్శనం. అందరికీ మెరుగైన విద్య, ఉపాధి, సమాజంలో సమాన అవకాశాలు లేక పోవటమే ఈ దుస్థితికి కారణమని ఆ నివేదిక వాపోయింది. మన చుట్టూ జరుగుతోన్న వాస్తవ పరిస్థితులను గుర్తించడం లో ఏమాత్రం ఏమరుపాటు వహించినా ఒక తరంఅభివృద్ధి ప్రమాదంలో పడుతుంది.
Read Also: Indigo: ఇండిగో విమానాల రద్దు.. లక్ష దాటిన ఫ్లైట్ టికెట్ ధర
దేశాభ్యుదయానికి జీవనాడి
యువశక్తి దేశాభ్యుదయానికి జీవ నాడి. ఆ తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇక మనదేశంలో 15-29 ఏళ్ల మధ్య వయస్కులను యువతగా పరిగణిస్తున్నాం. స్థూల దేశీ యోత్పత్తిలో వీరి వాటా 34శాతంగా ఉంది. యువ జనాభాపరంగా భార త్ను మరే దేశమూ అందుకోలేదనే మాటలు.. ఒకవైపు సంతోషాన్ని, మరోవైపు బాధని కలగ జేస్తున్నాయి. పనిచేయ గల వయసులో ఉన్న యువత ఉండటం సంతోషానికి కార ణమైతే మనదేశంలోని యువతకు తగిన నైపుణ్యాలు (Skilled youth)లేవనే వాస్తవం బాధ పెడుతోంది. దేశంలో డిగ్రీ చదివిన వారిలో 35.2శాతం, పీజీ పట్టా పుచ్చుకున్నవారిలో 36.2శాతం, సంప్రదాయ వృత్తి విద్యా కోర్సులను అభ్యసించిన వారిలో 33 శాతం మంది నిరుద్యోగులుగా మిగిలిపోవటం లేదా తమ చదువుకు తగని చిన్నాచితకా కొలువులతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. ఇక పురుషులతో పోల్చితే యువతుల్లో చాలా ఎక్కువగా ఉంది. దేశ జనాభాలో 48శాతం వాటా మహిళలదే అయినా కార్మిక శక్తిలో వారి భాగస్వామ్యం 20 శాతమే! మహిళలకు అనువైన ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వాల వైఫల్యం, పురుషాధిక్య భావజాలం, మెరుగైనరవాణా సదుపాయాలు లేకపోవటం, పిల్లల బాధ్యత తల్లిదేననే ధోర ణి దేశంలో మహిళాశక్తికి సమానావకాశాలను దూరంచేస్తు న్నాయి. ఏటా దాదాపు 1.1 కోట్ల దేశీయ యువత కొత్తగా ఉద్యోగాల వెతుకులాట మొదలుపెడుతుండగా, వారిలో సగం మంది తగిన నైపుణ్యాలు లేనేలేవు.
అతిపెద్ద సవాలు
మరోవైపు తమ సంస్థ లలో పనిచేయటానికి మెరుగైన మానవ వనరులు దొరకటం లేదంటూ ప్రముఖ సంస్థలు వాపోతున్నాయి. ఈ అగా ధాన్ని పూడ్చడమే ఇప్పుడు దేశం ముందున్న అతిపెద్ద సవాలు! మన కార్మిక శక్తిలో 92శాతానికిపైగా అసంఘటిత రంగంలో ఉండగా, 8 శాతం మంది మాత్రమే సంఘటిత రంగంలో సేవలందిస్తున్నారు. ఈ రెండు వ్యవస్థల అవస రాలు పూర్తిగా భిన్నమైనవే అయినా, యువతకు నైపుణ్యా లను(Skilled youth)అందించి, వారిని నిలకడగల ఉపాధి బాట పట్టిం చటం అవసరం. మనదేశంలో బెంగాల్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీలలో యువ జనాభా తగ్గుతుండగా, రాజ స్థాన్, బీహార్, యూపీ, మధ్యప్రదేశ్రాష్ట్రాలలో యువ జనాభా ఎక్కువగాఉంది. అయితే ఉత్తరాది యువత సాంకే తిక విద్యలేక సంప్రదాయ వృత్తుల్లో ఉండిపోతుండగా, దక్షిణాది వారు టెక్ నైపుణ్యాలను అందిపుచ్చుకుని విదేశీ అవకాశాలను పొందే దిశగా అడుగులువేస్తున్నారు. ఈ లోపా న్ని సరిదిద్దితే కాస్త ఆలస్యంగానైనా ఈ తేడాను సరిచేయ వచ్చు. దేశంలో 2022 నాటికి 40కోట్ల యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి, భిన్న రంగాల్లో వారిని తిరుగులేని మానవ వనరులుగా మలచే లక్ష్యంతో 2015లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘నైపుణ్య భారత్’ ప్రోగ్రాం ఆశించిన ప్రయోజనా లను సాధించలేకపోయింది. 2016లో ప్రారంభమైన ‘స్టార్టప్ ఇండియా’ అత్యధిక సంఖ్యలో అంకుర సంస్థలున్న మూడో దేశంగా భారత్ను మార్చినా స్టార్టప్లకు కావలసిన సదుపాయాలను, అనువైన వాతావరణాన్ని కల్పించలేకపో యింది. 94 శాతానికి పైగా స్టార్టప్లు నిధుల కొరతతో ఆరంభమైన ఏడాదిలోపే మూతబడుతున్నాయి. మరోవైపు ప్రతిభావంతులైన సాఫ్ట్వేర్లు విదేశీ ఉద్యోగాలకు పోవటం వల్లఏటా దేశానికి భారీగా నష్టం కలుగుతోంది. ఈ వాస్త వాలను పరిగణనలోకి తీసుకుని, నిరుద్యోగ యువత ఆకాం క్షలను నెరవేర్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి నడుం బిగించారు.
ప్రపంచంతో పోటీ
రాష్ట్రంలోని యువత సాంకేతిక నైపుణ్యాలు పెంచుకుని ప్రపంచంతో పోటీ పడాలని, ఉన్నత స్థానాల్లో స్థిరపడాలనే లక్ష్యంతోనే యంగ్ ఇండియా స్కిల్ యూని వర్శిటీ ఏర్పాటు చేశారు. గాంధీ స్ఫూర్తితో ఈ వర్సిటీ ఏర్పాటు చేశామని లక్షల మంది యువతకు నైపుణ్యాలను అందించి వారికి కొలువులు కల్పించటమే దీని లక్ష్యమని ప్రకటించారు. ఈ వర్సిటీలో 17 కోర్సులుంటాయని, ఈ ఏడాది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ఆస్కి)లో ఆరు కోర్సులలో 2 వేల మందికి నైపుణ్య శిక్షణనిచ్చేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పిల్లలకు బోధన రుసుం రీయింబర్స్ చేయటం, ట్రైనింగ్ పూర్తయిన వారికి కొలువులిచ్చేందుకు కొన్ని కంపెనీలున్నా యన్నారు. దేశంలో డిగ్రీ చదివిన వారిలో 35.2శాతం, పీజీ పట్టా పుచ్చుకున్న వారిలో36.2 శాతం, సంప్రదాయ కోర్సులను అభ్యసించిన వారిలో 33 శాతం మంది నిరుద్యో గులుగా మిగిలిపోవటం లేదా తమ చదువుకు తగని కొలు వులతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. ఇకపురుషులతో పోల్చితే యువతుల్లో చాలా ఎక్కువగా ఉంది. దేశ జనాభా లో 48శాతం వాటా మహిళలదే అయినా కార్మిక శక్తిలో వారి భాగస్వామ్యం 20 శాతమే! తెలంగాణ యానిమేషన్ అసోసియేషన్ ముందుకు రావటం విశేషం. ముచ్చర్ల సమీ పంలో వర్సిటీ మెయిన్ క్యాంపస్ ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని 6 ప్రాంతాల్లో దీనికి అను బంధంగా క్యాంపస్ల ఏర్పాటుకు సర్కారు రెడీ అవుతోంది. ఇంత పెద్ద దేశంలో కేవలం ఢిల్లీ, హర్యానా, తెలంగాణ తప్ప మరో రాష్ట్రంలో స్కిల్ వర్సిటీలు లేకపోవటందురదృష్టకరం. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వ చొరవను ప్రశంసించాలి. ప్రభుత్వం చేపట్టిన ఈ స్కిల్ యూనివర్సిటీ రాబోయే రోజులలో నైపుణ్యాల శిక్షణలో దేశానికే దిశానిర్దేశం చేయాలని అందరం ఆకాంక్షిద్దాం.
-కోడూరు సాల్మన్ రాజు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: