📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Minister Narayana : సింగపూర్ లో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన-రేపు మలేషియాకు మంత్రి

Author Icon By Shravan
Updated: July 31, 2025 • 2:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : అమరావతి స్మార్ట్ సిటీ నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలను సింగపూర్ పర్యటనలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ (Minister Narayana) అధ్యయనం చేస్తున్నారు. రాజధానిలో మోళికవసతుల నిర్మాణం, భవనాలు, భారీ కన్వెన్షన్ సెంటర్ల కు సంబంధించి పలు అంశాలపై సవివరంగా మంత్రి నారాయణ తెలుసుకుం టున్నార ఈ క్రమంలో సింగపూర్ లో మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతుంది… ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్లారు మంత్రి నారాయణ…అయితే సీఎం చంద్రబాబు తన పర్యటన ముగించుకుని పొంగూరు ఏపీకి బయలుదేరగా  మంత్రి నారాయణ మాత్రం అమరావతి నిర్మాణానికి సంబంధించిన మరికొన్ని అంశాలపై అధ్యయనం చేసేందుకు సింగపూర్ లోనే ఉన్నారు…బుధవారం సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబుతో కలిసి మంత్రి నారాయణ పలు అంశాలను అధ్యయనం చేసారు..

సింగపూర్ లో ఉన్న ఎస్ సంస్థ(సుర్బానా జురాంగ్) కార్యాలయాన్ని మంత్రి నారాయణ సందర్శించారు. పట్టణ మోలిక వసతుల కల్పనకు సంబంధించి డిజైన్ల రూపకల్పనలో శీరి సంస్థ కు దశాబ్దాల అనుభవం ఉంది… అమరావతిలో అమరావతిలో సూక్ష్మ స్థాయిలో పచ్చదనం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ళీరి సంస్థ ప్రతినిధులతో చర్చించారు మంత్రి. అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం పచ్చదనం పెంపునకు సంబంధించి గతంలో సింగపూర్ స్థూల ప్రణాళిక ఇచ్చింది.. అమరావతి స్మార్ట్ సిటీ నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేస్తూ బ్లూ గ్రీన్ సిటీగా నిర్మిస్తుంది ప్రభుత్వం…..

అమరావతిలో పెద్ద ఎత్తున నిర్మిస్తున్న రోడ్లు, భవనాలు, ఎల్పీఎస్ లే అవుట్ లు, పార్కుల్లో గ్రీనరీ ఏ విధంగా ఉండాలనేదానిపై ఎస్ జె సంస్థ ప్రతినిధులు పలు ప్రణాళికలను మంత్రి ముందుంచారు… ఇక బుధవారం మధ్యాహ్నం సింగపూర్ (Singapore) లోని మెరీనా శాండ్స్ బే వద్ద ఉన్న శాండ్స్ ఎక్స్ పో అండ్ కన్వెన్షన్ సెంటర్ ను మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు పరిశీలించారు. ఈ కన్వెన్షన్ సెంటర్ సింగపూర్ లోనే అతిపెద్దది… సుమారు 45 వేల సీటింగ్ తో పలు మీటింగ్ హాల్స్ ఈ కన్వెన్షన్ సెంటర్ లో ఉన్నాయి. ఇదే కన్వెన్షన్ సెంటర్ లో 11 వేల సీటింగ్ ఉన్న బాల్ రూం ఆగ్నేయాసియాలోనే అతి పెద్దతి… కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం, ఉపయోగించిన సాంకేతికత గురించి మంత్రి నారాయణకు సింగపూర్ ప్రతినిధులు వివరిం చారు…

ఇప్పటికే అమరావతిలో నాలుగు కన్వెన్షన్ సెంటర్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. సింగపూర్ శాండ్స్ ఎక్స్ పో అండ్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంలో ఉపయోగించిన లేటెస్ట్ టెక్నాలజీని అమరావతిలో పలు నిర్మాణాల్లో ఉపయపడు తుందని మంత్రి నారాయణ భావిస్తున్నారు… గురు, శుక్రవారం కూడా సింగపూర్ పలు ప్రాంతాలను సందర్శించనున్నారు మంత్రి నారాయణ.. ఎల్లుండి సింగపూర్ నుంచి బయలుదేరి మలేషియా కు వెళ్లనున్నారు.. మలేషియా ఆర్ధిక రాజధాని పుత్రజయతో పాటు కౌలాలంపూర్ లో పలు ప్రాంతాల్లో అధ్యయనం తర్వాత ఆగస్టు రెండో తేదీ రాత్రికి ఏపీకి రానున్నారు.

Read Hindi News : hindi.vaartha.com

Read also : BJP : రాయలసీమ అభివృద్ధికి బిజెపి కృషి చేస్తోంది : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్

Ap Breaking News in Telugu Latest News in Telugu minister narayana singapore Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.