శ్రీకాకుళం: సిక్కోలు రాజకీయాల్లో ఓ శిఖరం నేలకొరిగింది. నీతి నిజాయితీకి చిరునామాగా పాలన సాగించిన మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ అస్తమించారు. సిక్కోలు సూర్యడు అస్తమించారంటూ జనం అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రజా సేవే ధ్యేయంగా, విలువలే ఆయుధంగా గుండ అప్పలసూర్యనారాయణ రాజకీయ జీవితాన్ని గడిపారు. మున్సిపల్ కౌన్సిలర్ గా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన పని చేశారు. కౌన్సిలర్ నుంచి రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగినా ఎల్లప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ (Gunda Appala Surya Narayana) ఇక లేరన్న ఘటన గుండ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
Read also: Fire Accident : అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది
Sikkolu Suryudu
ఆదివారం మధ్యాహ్నం కాలుజారి పడిపోయారు.
అరసవిల్లిలోని తన నివాసంలో బాత్రూంలో మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ ఆదివారం మధ్యాహ్నం కాలుజారి పడిపోయారు. ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వెంటనే గుర్తించి కుటుంబ సభ్యుల సహకారంతో చికిత్స కోసం శ్రీకాకుళం నగరంలోని బగ్గు సరోజినిదేవి ఆసుపత్రిలో చేర్పించారు. గతంలో మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ బ్రెయిను సర్జరి కాగా కాలు జారి పడిపోవడంతో అదే ప్రాంతంలో మళ్లీ దెబ్బ తగలడంతో రక్తం గడ్డ కట్టడంతో పరిస్థితి విషమంగా మారింది. వెంటిలేటర్ ఏర్పాటు చేసి వైద్యులు చికిత్స అందించారు. చికిత్స పొందుతూనే అప్పలసూర్యనారాయణ తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త క్షణాల్లో శ్రీకాకుళం నగరం, మున్సిపాలిటీ మొత్తం వ్యాపించడంతో తెలుగు దేశం పార్టీ నాయకలు, కార్యకర్తలతో పాటు గుండ కుటుంబ అభిమానులు, అప్పల సూర్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులు అనుచరులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన
వారు నివాసం ఉండే అరసవిల్లి ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. రాజకీయాల్లో అప్పల సూర్యనారాయణ రూటే సెపరేటు. ఎమ్మెల్యే అంటే అందనంత ఎత్తులో ఉంటే ఆయన మాత్రం జనం చెంతకే వెళ్లిపోయి ఆయన ఇంటిలోని గది వరకూ తీసుకుని వెళ్లి మాట్లాడేవారు. అది ఆయన సింప్లిసిటీకి నిదర్శనం. అటువంటి నాయకుడును సిక్కోలు జిల్లా కోల్పోయింది. సిక్కోలు జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన గుండ అప్పల సూర్యనారాయణ మృతి చెందిన వార్త అటు రాజకీయ వర్గాలనే కాకుండా ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో అప్పలసూర్యనారాయణ ప్రస్థానం చిరస్థాయిగా నిలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: