📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Shyamala: కుక్కల పై చూపించే శ్రద్ధ పిల్లల పై చూపిస్తే బాగుంటుంది

Author Icon By Saritha
Updated: February 9, 2026 • 3:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైసీపీ నేత (YCP) ఆరె శ్యామల (Shyamala) చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. కుక్కల సంరక్షణపై మాట్లాడడానికి మనకు ఎందరో సెలబ్రిటీలు ఉన్నారు కానీ గిరిజన బిడ్డల గురించి మాట్లాడడానికి ఎవరూ లేకపోవడం దౌర్భాగ్యం! గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉడకని ఇడ్లీ, నిల్వ చట్నీ 89 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో 70 మందికి చికిత్స ఒకే మంచంపై నలుగురైదుగురికి సెలైన్లు. ఆశ్రమ పాఠశాలల్లో మరణమృదంగం మోగుతున్నా తీరు మారని బాబు సర్కారు గిరిజన విద్యార్థుల ఆరోగ్యాలతో చెలగాటం.

కూటమి అధికారం చేపట్టాక ఏపీలో ఇప్పటివరకు సరైన ఆహారం, మంచినీరు, వైద్యం లేక 50 మంది వరకు మరణించారు వందలమంది అనారోగ్యం బారిన పడ్డారు. దీనిపై ఏ మీడియాలోనూ చర్చలు జరగవు ఏ మేధావులూ మాట్లాడరు. కుక్కల సంరక్షణపై మాట్లాడడానికి మనకు ఎందరో సెలబ్రిటీలు ఉన్నారు కానీ గిరిజన బిడ్డల గురించి మాట్లాడడానికి ఎవరూ లేకపోవడం దౌర్భాగ్యం అంటూ ట్వీట్ చేశారు.

Read Also: AP Constituency Ranks: ఏపీలో నంబర్ 1 నియోజకవర్గం ఇదే!

ఆశ్రమ పాఠశాల భోజనంపై తీవ్ర ఆరోపణలు

పోలవరం జిల్లా దేవరపల్లి (Shyamala) గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్‌ పాయిజన్ అయ్యింది. శనివారం రోజు ఇడ్లీలు తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులతో ఇబ్బంది పడ్డారు వెంటనే మొత్తం 89మందిని ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరు కోలుకోవడంతో తిరిగి స్కూల్‌కు పంపించారు మిగిలినవారు ఆస్పత్రిలో ఉన్నారు. అయితే విద్యార్థులు అస్వస్థతకు గురికావడానికి ఇడ్లీ రవ్వ, శనగపిండి కారణమి తేల్చారు గడువు ముగిసిన వాటితో ఫుడ్ తయారు చేయడమే కారణం అంటున్నారు.

ఈ వ్యవహారంలో స్కూల్ వార్డెన్, వంటమనిషిని గిరిజన సంక్షేమ శాఖ అధికారులు సస్పెండ్ చేశారు విచారణ జరుగుతోంది. మరోవైపు దేవరపల్లి స్కూల్‌లో విద్యార్థులు అస్వస్థకు గురైన ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు అధికారులతో సమీక్ష చేశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి తనకు నివేదించాలని ఆదేశించారు. అధికారులు పరిస్థితిని సీఎంకు వివరించారు. ఆరె శ్యామల కూడా ఈ ఘటనను ప్రస్తావిస్తూ ఈ ట్వీట్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP Tribal Schools Devarapalli School Food Poisoning Latest News in Telugu Telugu News Tribal Students Issue ycp shyamala YSRCP Leader Tweet

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.