Kodali Nani : కొడాలి నాని అరెస్ట్ తప్పదా?

Read Time:  1 min
నానికి శస్త్రచికిత్స పూర్తి మరికొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలోనే
నానికి శస్త్రచికిత్స పూర్తి మరికొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలోనే
FONT SIZE
GET APP

వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani )పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. దేశం విడిచి పారిపోవడానికి అవకాశాలు ఉన్నాయని సమాచారం రావడంతో, భూమార్గం, వాయుమార్గం, జలమార్గాల్లో ఆయన్ని పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఇది ఒక రకంగా నానిపై కేంద్రం ఉక్కుపాదం మూర్చినట్లు చెబుతుండగా, రాజకీయంగా ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తీవ్ర అభియోగాల కేసులు – అరెస్టుకు రంగం సిద్ధమా?

ఆంధ్రప్రదేశ్‌లో కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. అందులో కొన్ని కేసుల్లో గరిష్ఠంగా ఏడేళ్ల వరకు శిక్ష పడే సెక్షన్లు ఉన్నట్లు సమాచారం. నేరం రుజువైతే ఆయనను జైలుకు పంపే అవకాశాలు ఉన్నాయంటూ అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థుల్లో ఆయన విచారణ నుంచి తప్పించుకునేందుకు దేశం విడిచిపోవచ్చన్న అనుమానంతోనే కేంద్రం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన అరెస్ట్‌కు ముహూర్తం దగ్గరపడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాజకీయ వేధింపులా? ఉచ్చు బిగుస్తుందా?

కొడాలి నాని చుట్టూ ఇక్కడితో ఉచ్చు బిగుస్తోంది. అయితే ఇది రాజకీయ వేధింపులా? లేక న్యాయపరమైన చర్యల భాగమా అన్న దానిపై వివిధ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ శ్రేణులు దీన్ని రాజకీయ ప్రేరణతో చేస్తున్న కుట్రగా అభివర్ణిస్తున్నప్పటికీ, అధికార వర్గాలు మాత్రం న్యాయ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నామంటూ స్పష్టం చేస్తున్నాయి. ఏది నిజమైనా, నానిపై చర్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొననున్నాయి.

Read Also : Tirumala : శ్రీవారి కొండపై హల్ చల్.. కానిస్టేబుళ్ల సస్పెండ్

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

// ── Embeds ── if (document.querySelector('blockquote.twitter-tweet, .twitter-tweet')) { const s = document.createElement('script'); s.src = 'https://platform.twitter.com/widgets.js'; s.async = true; s.charset = 'utf-8'; document.body.appendChild(s); } if (document.querySelector('.instagram-media')) { const s = document.createElement('script'); s.src = 'https://www.instagram.com/embed.js'; s.async = true; document.body.appendChild(s); }