📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Shivraj Singh Chouhan: కరవు నివారణకు శాశ్వత చర్యలు

Author Icon By Ramya
Updated: July 11, 2025 • 10:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వచ్చే పదేళ్లకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయండి : కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్

పుట్టపర్తి : క్షేత్రస్థాయిలో పని చేసే అధికారులకు ఎక్కడ ఎలాంటి లోపాలు ఉన్నా యనేది క్షుణ్ణంగా తెలుసని, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎలా అధిగమించవచ్చు అనేది కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కరువుకు శాశ్వత పరిష్కారం ఏ విధంగా తీసుకురావచ్చు అనే దానిపై దృష్టి పెట్టాలని కేంద్ర వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి శాఖా మాత్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) పేర్కొన్నారు. గురువారం పుట్టపర్తి (Puttaparthi) పట్టణం, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో దక్షిణ ఆంధ్ర ప్రదేశ్లోని కరువు పీడిత జిల్లాల సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం పుట్టపర్తి మండలం, పెడబల్లి గ్రామ పొలాల్లో రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలతో జరిగిన ముఖాముఖి సమావేశంలో కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Shivraj Singh Chouhan: కరవు నివారణకు శాశ్వత చర్యలు

శాశ్వత పరిష్కారాలపై కేంద్ర మంత్రుల దృష్టి

ఈ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రితోపాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, రాష్ట్ర హార్టికల్చర్ అండ్ సిరికల్చర్ కమి షనర్ కే.శ్రీనివాసులు, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్, అనంతపురం జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, కర్నూలు జాయింట్ కలెక్టర్ నవ్య, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) మాట్లాడుతూ దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలలో కరువును శాశ్వతంగా పరిష్కరించాలన్నదే తమ ఉద్దేశం అన్నారు. వ్యవసాయ అనుబంధరంగాల అధికారులు కలిసికట్టుగా కూర్చుని ఆలోచన చేయాలని, అలాగే కేంద్రంతో కూడా కరువు నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఆలోచించాలన్నారు. అధికారులు ఆయా జిల్లాల యంత్రాంగంతో కలిసి వివిధ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తమ ఆధ్వర్యంలో రూరల్ డెవలప్మెంట్, ఎన్ఆర్ఎజిఎస్, వాటర్ షెడ్, తదితర వాటి కింద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, ఇతర శాఖలకు సంబంధించి ఎలాంటి సహకారం కావాలన్నా తాము అందించడం జరుగు తుందన్నారు. ఇప్పుడు ఏం చేయాలి, రేపు, భవిష్యత్తులో ఏం చేయాలి. వచ్చే పదేళ్లకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేదానిపై కార్యచరణ ప్రణాళిక తయారు చేయాలని సూచించారు.

కలిసికట్టుగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి

ఈ విషయం అధికారులు అంతా కలిసికట్టుగా కూర్చుని తగిన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ఏమైనా ఆలోచనలు ఉంటే తెలియజేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ మోడల్ తయారుచేసి కరువు నివారణకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కరువు నివారణ చర్యలపై దృష్టి పెట్టాలని, కేంద్రం కూడా ఇందుకు సహకారం అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ (District Collector T.S. Chetan) మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాలు, ఉద్యాన శాఖ పరిధిలో పరిస్థితుల గురించి తెలియజేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, రాష్ట్ర హార్టికల్చర్ అండ్ సిరికల్చర్ కమిషనర్ కే. శ్రీనివాసులు మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలలో కరువు పరిస్థితి, వివిధ పంటల సాగు వివరాలు, ఇరిగేషన్ అంశాల గురించి ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. బుందేల్హండ్ రీజియన్ మాదిరిగా రాయలసీమ జిల్లాలకు కూడా ఆర్థిక సహాయం ప్రకటించాలని, సీమ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని కోరారు. ఇక్కడ జిల్లా కలెక్టర్ టి.ఎస్. చేతన్ సూచించిన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. “ప్రకృతి వ్యవసాయంలో ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ. ఇది దేశానికి ఆదర్శంగా మారుతుంది” అని మంత్రి గారు పేర్కొన్నారు.

తక్కువ భూమిలో అధిక లాభం సాధించాల్సిన అవసరం

ఆధునిక సాంకేతికతను వినియోగించి, తక్కువ భూమిలోనూ అధిక లాభాన్ని సాధించవచ్చని, దీనివల్ల చిన్న రైతులకు అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మహిళా సంఘాల సోదరీమణులు ఇప్పుడు స్వయం సమర్థులవుతున్నారు. తాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన “లాడ్లీ బహనా యోజన’ను గుర్తు చేస్తూ, మహిళల సాధికారతకు నేను ప్రాధాన్యం ఇస్తానన్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తి, అనంతపురం.. ఉమ్మడి జిల్లాలకు చెందిన 53,746 ఎస్ హెచ్ జి సభ్యులకు రూ.437.09 కోట్ల బ్యాంకు లింకేజ్ చెక్కును అందించారు అంతకు ముందు పెడబల్లి గ్రామంలో సేంద్రీయ పద్దతిలో సాగు చేసిన మిశ్రమ పంటను పరిశీలించారు. అలాగే వర్షాభావం వల్ల ఎండిన పంటలపై ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను తిలకించారు. ముందుగా ఎస్ హెచ్ జి మహిళల ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో జేసి అభిషేక్ కుమార్, భారత ప్రభుత్వ రైతుల సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ పేర్ని దేవి, రాష్ట్ర సేర్స్ సీ.ఈ.ఓ వి. కరుణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వపు ఆగ్రికల్చర్, మార్కెటింగ్, సహకార సంస్థ చైర్మన్ టి. విజయ్ కుమార్, డిఆర్డీఏ పీడి నర్సయ్య, రైతులు, మహిళా సంఘ సభ్యులు, రాయలసీమ జిల్లాల వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు, తదితరులు పాల్గొన్నారు.

శివరాజ్ సింగ్ చౌహాన్ బ్యాక్ గ్రౌండ్?

శివరాజ్ సింగ్ చౌహాన్ సెహోర్ జిల్లాలోని జైట్ గ్రామంలో ప్రేమ్ సింగ్ చౌహాన్ మరియు అతని భార్య సుందర్ బాయి చౌహాన్ దంపతులకు ఒక రైతు కుటుంబంలో జన్మించాడు మరియు కిరార్ సమాజానికి చెందినవాడు. అతను భోపాల్ లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ (తత్వశాస్త్రం) లో బంగారు పతక విజేత.

శివరాజ్ సింగ్ చౌహాన్ ఎవరు?

శివరాజ్ సింగ్ చౌహాన్ (జననం 5 మార్చి 1959) ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు భారతీయ జనతా పార్టీ సభ్యుడు. ఆయన భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి 17వ మరియు ప్రస్తుత ముఖ్యమంత్రి. ఈ కథనాన్ని నవీకరించాలి.

శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానంలో ఎవరు?

భారతీయ జనతా పార్టీకి చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్ 16న్నర సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసి, రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2023 ఎన్నికల తర్వాత చౌహాన్ స్థానంలో ఆయన సొంత పార్టీకి చెందిన డాక్టర్ మోహన్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు, ఇది బిజెపికి అఖండ విజయంగా భావించబడింది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Chandrababu Naidu: బాలుడు మృతి పై సీఎం చంద్రబాబు సీరియస్ విచారణ జరపాలని ఆదేశాలు

AgriculturePolicy Breaking News DroughtRelief FarmersWelfare latest news NaturalFarming RuralDevelopment SelfHelpGroups Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.