📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Shiva Raj Kumar: విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న శివన్న

Author Icon By Anusha
Updated: December 5, 2025 • 4:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ (Shiva Raj Kumar), విజయవాడలో పర్యటించారు. తన అర్ధాంగి గీతతో కలిసి తొలిసారిగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. టాలీవుడ్ నుంచి తనకు ఇప్పటికే రెండు, మూడు సినిమా ఆఫర్లు వచ్చాయని, అయితే ఇంకా ఏ ప్రాజెక్టుకు సైన్ చేయలేదని స్పష్టం చేశారు.

Read Also: Akhanda 2: ‘అఖండ 2’ వాయిదా.. సురేశ్‌ బాబు ఏమన్నారంటే?

Shiva Raj Kumar visits Kanaka Durga temple in Vijayawada

తెలుగు సినిమాలను ఎన్నారైలు ఎక్కువగా ఆదరిస్తారు

ఈ సందర్భంగా, “భవిష్యత్తులో మంచి దర్శకుడు వస్తే చంద్రబాబు బయోపిక్‌లో నటిస్తారా?” అని విలేకరులు అడగ్గా, ఆయన ఆసక్తికరంగా స్పందించారు. ఒక బయోపిక్‌లో నటించడం ఇదే తొలిసారని, భవిష్యత్తులో వచ్చే అవకాశాలను, అప్పుడు చూస్తానని బదులిచ్చారు. తెలుగు సినిమాలను మన దేశంలో కంటే ఎన్నారైలు ఎక్కువగా ఆదరిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

శివ రాజ్ కుమార్ (Shiva Raj Kumar) ప్రస్తుతం ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, సీపీఎంఎల్ నాయకుడు గుమ్మడి నర్సయ్య (Gummadi Narsaiah) జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Darshan Kanaka Durga Temple latest news Shiva Rajkumar Telugu News Vijayawada visit

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.