Shirdi Visit : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్(Nara Lokesh), తన అర్ధాంగి బ్రహ్మణితో కలిసి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శిరిడీ చేరుకున్నారు. శిరిడీ సాయినాథుని దర్శించుకునేందుకు వచ్చిన లోకేశ్ దంపతులకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
Read Also: Makara Sankranti: సంక్రాంతికి సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు..
సోమవారం ఉదయం జరిగే కాకడ హారతి సేవలో లోకేశ్, బ్రహ్మణి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. శిరిడీ విమానాశ్రయంలో మంత్రికి కోపర్గావ్ ఎమ్మెల్యే, సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మాజీ చైర్మన్ అశుతోష్ ఆకాశరావు కాలే, ఇతర అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ పర్యటనలో మంత్రి లోకేశ్ వెంట చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా ఉన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: