📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Nara Lokesh : షైనింగ్ స్టార్స్ ను సన్మానించిన మంత్రి నారా లోకేశ్…

Author Icon By Divya Vani M
Updated: May 20, 2025 • 8:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తమ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచారు.పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించి, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని పెంచారు.ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నారని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల సహకారంతో తమ లక్ష్యాలను సాధించగలమని ఈ విద్యార్థులు నిరూపించారు.వారు సాధించిన మార్కులు, పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్యా ప్రమాణాలను ప్రతిబింబిస్తాయి.విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, (Minister Nara Lokesh) ఉండవల్లిలోని తన నివాసంలో ‘షైనింగ్ స్టార్స్-2025’ (‘Shining Stars-2025’) కార్యక్రమంలో ఈ ప్రతిభావంతులైన విద్యార్థులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ ఆనందాన్ని, అనుభవాలను పంచుకున్నారు.పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన అంగడి పావని చంద్రిక, 600లో 598 మార్కులు సాధించారు.ఆమె మాట్లాడుతూ, “మమ్మల్ని( Nara Lokesh) గారు సన్మానిస్తారని ఊహించలేదు.ప్రభుత్వ పాఠశాలల్లో కూడా క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారని మా మార్కులే నిరూపించాయి.డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో నాణ్యత పెరిగింది.పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేస్తున్నారు.మంత్రి గారి ప్రోత్సాహం మా తర్వాతి తరాలకు స్ఫూర్తినిస్తుంది.ఐఏఎస్ కావాలన్నది నా లక్ష్యం” అని తెలిపారు.శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని కంచరాన జ్యోషిత, 600లో 597 మార్కులు సాధించారు.ఆమె మాట్లాడుతూ, “మంత్రి గారి చేతుల మీదుగా మెడల్ అందుకోవడం సంతోషంగా ఉంది.ప్రభుత్వ పాఠశాలల్లో ఐఐటీ స్థాయిలో బోధన అందుతోంది. మంత్రి గారి బాధ్యతలు చేపట్టాక పాఠశాలల్లో చాలా మార్పులు వచ్చాయి.

Nara Lokesh షైనింగ్ స్టార్స్ ను సన్మానించిన మంత్రి నారా లోకేశ్…

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కావాలన్నది నా లక్ష్యం, యూపీఎస్సీ కూడా సాధించి ప్రజలకు సేవ చేస్తా” అని అన్నారు.పల్నాడు జిల్లా మాచర్ల జడ్పీ బాలికల ఉన్నత పాఠశాకు చెందిన షేక్ సమీర, 600లో 596 మార్కులు సాధించారు. ఆమె మాట్లాడుతూ, “మా నాన్న ఎలక్ట్రీషియన్. మంత్రి గారితో సన్మానం అందుకుంటానని ఊహించలేదు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం చాలా మెరుగుపడింది. మంత్రి గారి వచ్చాక స్టడీ మెటీరియల్ అందించారు, జిల్లా స్థాయిలో సమావేశాలు ఉపయోగపడ్డాయి. ఐఏఎస్ అయ్యాక పేద విద్యార్థులకు ఉచిత విద్య, రైతులకు సహాయం చేస్తా.

పల్నాడు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా” అని వివరించారు.తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి హుకుంపేట జడ్పీ ఉన్నత పాఠశాకు చెందిన దివ్యాంగ విద్యార్థి కనితి కిషోర్, 500లో 487 మార్కులు సాధించారు.ఆయన మాట్లాడుతూ, “మంత్రి గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. పదో తరగతి పరీక్షలకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ మంచి ఫలితాలనిచ్చింది. అంగవైకల్యం ప్రతిభకు అడ్డుకాదని నిరూపించాలనుకున్నా. ఐఎఫ్‌పీ ప్యానళ్లు, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ బాగున్నాయి.గతంలో కంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్ల నాణ్యత పెరిగింది, వాటిపై పార్టీ గుర్తులు లేకపోవడం మంచి నిర్ణయం.ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ కావడంతో గ్రాండ్ టెస్టులు భయాన్ని పోగొట్టాయి. భవిష్యత్తులో ఐఏఎస్ కావాలన్నది నా లక్ష్యం” అని తెలిపారు.విద్యార్థిని పావని చంద్రిక తల్లి అంగడి సంధ్య మాట్లాడుతూ, “మా పాప మంత్రిగారి చేతుల మీదుగా సత్కారం అందుకోవడం ఆనందంగా ఉంది. ఉపాధ్యాయులు బాగా ప్రోత్సహించారు, 100 రోజుల యాక్షన్ ప్లాన్ బాగా ఉపయోగపడింది” అని అన్నారు.

Andhra Pradesh Education AP SSC Results Government School Success Inspiring Student Stories Lokesh Honors Students Shining Stars 2025 SSC Toppers 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.