Shashank Kanumuri : భీమవరం కు చెందిన ప్రతిభావంతుడైన ఈక్వెస్ట్రియన్ (గుర్రపు స్వారీ) క్రీడాకారుడు శశాంక్ కనుమూరిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా అభినందించారు. థాయ్ పోలో క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఈవెంటింగ్ ఏషియన్ ఛాంపియన్‌షిప్ 2025 పోటీల్లో భారత జట్టు తరపున పాల్గొన్న శశాంక్ రజత పతకాన్ని సాధించి దేశానికి గర్వకారణమయ్యారు.
Read also: H1B Visa: అమెరికా వీసాలపై కఠిన నిబంధనలు
ఈ విజయానంతరం శశాంక్ అమరావతిలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గుర్రపు స్వారీ చేస్తూ అడ్డంకులు (Shashank Kanumuri) దాటే ఈవెంటింగ్ క్రీడల్లో తనకు దాదాపు పదేళ్ల అనుభవం ఉందని ఆయన ముఖ్యమంత్రికి వివరించారు. శిక్షణ, క్రమశిక్షణ, నిరంతర సాధన వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు.
శశాంక్ సాధించిన విజయం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. యువ క్రీడాకారులకు శశాంక్ ఒక ప్రేరణగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: