📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

ఏపీ బడ్జెట్ పై షర్మిల ఆగ్రహం

Author Icon By Sudheer
Updated: April 2, 2025 • 4:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.3.22 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌పై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉందని, కేవలం అంకెల గారడీ మాత్రమేనని ఆమె వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం మిషన్, విజన్ లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ముఖ్యంగా ‘సూపర్ సిక్స్’ పథకాలను పూర్తిగా పక్కన పెట్టడం దారుణమని షర్మిల మండిపడ్డారు.

కేంద్రం పై ఆధారపడింది

రైతులకు, విద్యార్థులకు, మహిళలకు తగిన విధంగా నిధులు కేటాయించకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి అవసరమైన మొత్తంలో నిధులు కేటాయించకుండా, కేంద్రంపై ఆధారపడేలా చేయడం అన్యాయమని విమర్శించారు. విద్యార్థుల సంక్షేమానికి సరిపడా నిధులు లేకపోవడం, ‘తల్లికి వందనం’ వంటి పథకాలకూ కోత విధించడం విద్యా రంగానికి నష్టమని పేర్కొన్నారు. అలాగే, ‘దీపం-2’ పథకానికి తగిన నిధులు కేటాయించకపోవడం వల్ల లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.

మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి నిధులు కేటాయించకపోవడం ఏంటి..?

మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి నిధులు కేటాయించకపోవడం, మహిళా ఆర్థిక సాధికారత కోసం ‘మహాశక్తి’ పథకాన్ని పూర్తిగా విస్మరించడం దారుణమని విమర్శించారు. నిరుద్యోగ భృతి, జాబ్ కాలెండర్‌పై ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా, 50 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. అంతేగాక, రాజధాని అమరావతికి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా అప్పులతోనే నిర్మించాలని భావించడం కూటమి ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమని షర్మిల వ్యాఖ్యానించారు. బడ్జెట్‌లో ఉన్న అసమతుల్యతలు రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేయగలవని ఆమె హెచ్చరించారు.

ap budget 2025-26 Google news ys sharmila

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.